శ్రీకాకుళం

పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 27: పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచి జిల్లాను ప్రపంచ పటంలో నిలపాలని ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా ఆర్ట్స్ కళాశాల రోడ్డులో అంబేద్కర్ ఆడిటోరియంలో పర్యాటక శాఖ, సంప్రదాయంవారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్టప్రర్యాటక రంగంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. జిల్లా కళాత్మకంగా సాంస్కృతిక పరంగా ఎంతో పరిణితి చెందిందన్నారు. ప్రతీ గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ జిల్లాగా ఉంచాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ మన జిల్లాలో అనేక చారిత్రాత్మకమైన సంపద ఉందని దాన్ని ఉపయోగించుకొని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా జానపద కళలైన తప్పెటగుల్లు, కోయినృత్యం, చెక్క్భజన వంటి కళాకారులు ఆయా కళలను ప్రదర్శించారు. అదే విధంగా సుసరాపు లక్ష్మీగణపతి శర్మ ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత విభావరి, కలైమామణి మాధవపెద్దిమూర్తి శిష్యబృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యం, సంప్రదాయం విద్యార్థిణి హంసినీచే కూచిపూడి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే విధంగా పర్యాటక రంగంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఎంపి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.