యువ

స్మార్ట్ గ్లాస్ వచ్చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ ఫోన్ల రంగంలో ఊహించని మార్పులు?

గత దశాబ్దంలో టెక్నాలజీ సృష్టించిన వింతలూ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, వేరబుల్ డివైస్‌ల రంగంలో ఊహించని మార్పులకు టెక్నాలజీ శ్రీకారం చుట్టింది. స్మార్ట్ఫోన్... ప్రపంచానే్న తనలో ఇముడ్చుకోగలిగిందంటే ఆ ఘనత నిస్సందేహంగా టెక్నాలజీదే. అయితే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం ఇంతటితోనే ఆగిపోదు. భవిష్యత్తులో మరెన్నో సరికొత్త ఆవిష్కరణలను చూడబోతున్నాం. అంతెందుకు? లండన్‌లోని బాడీ టెక్నాలజీస్ సంస్థకు చెందిన శాస్తవ్రేత్తలు రూపొందించిన ‘స్మార్ట్ గ్లాస్’ మార్కెట్లోకి వస్తే, స్మార్ట్ ఫోన్లు, వేరబుల్ డివైస్‌ల రంగంలో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఏమిటీ స్మార్ట్ గ్లాస్? టచ్ స్క్రీన్ మెటీరియల్‌తో, రీరైటబుల్ డివిడిలలో వాడే టెక్నాలజీని అనుసరించి స్మార్ట్ గ్లాస్‌ను రూపొందించారు. ఇది వినియోగించే కరెంటు చాలా తక్కువట. స్వయం ప్రకాశాన్ని కలిగి ఉంటుందట. స్మార్ట్ గ్లాస్ ఆవిష్కరణ...స్మార్ట్ ఫోన్ల రంగాన్ని ఓ ఊపు ఊపుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లోని బ్యాటరీ వినియోగంలో 90 శాతం డిస్ ప్లేకోసమే వినియోగమవుతుందట. స్వయం ప్రకాశవంతమైన స్మార్ట్ గ్లాస్‌ను స్మార్ట్ ఫోన్‌కు అమరిస్తే... బ్యాటరీపై ఒత్తిడి పడదు. స్మార్ట్ ఫోన్లయినా, స్మార్ట్ వాచ్‌లయినా ప్రతి రోజూ చార్జి చేసుకోవాల్సిందే. స్మార్ట్ గ్లాస్‌తో ఇక ఆ బాధ ఉండదట. స్మార్ట్ గ్లాస్ అమర్చిన పరికరాలను వారానికి ఓసారి చార్జ్ చేస్తే సరిపోతుందట. స్మార్ట్ గ్లాస్ వాడకంలోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరో విశేషమేమిటంటే... స్మార్ట్ గ్లాస్‌ను తయారు చేసిన శాస్తవ్రేత్తల బృందంలో ఓ ప్రవాస భారతీయుడూ ఉండటం. ఆయన పేరు హరీశ్ భాస్కరన్. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గానూ, బాడీ టెక్నాలజీస్‌లో వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు.