రాష్ట్రీయం

స్మితా సభర్వాల్‌కు నోటీసులివ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాం
విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు ప్రస్తుత దశలో నోటీసులివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైనప్పుడు తప్పకుండా నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఔట్‌లుక్ మ్యాగ్‌జైన్ ప్రచురించిన కార్టూన్, న్యూస్ రిపోర్టుపై న్యాయపరంగా పోరాటం చేసేందుకు అవసరమైన రూ.15 లక్షల సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి స్మితాసభర్వాల్‌కు మంజూరు చేయడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని, దీనిపై స్మితాసభర్వాల్‌కు నోటీసులివ్వాలని మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఔట్‌లుక్ మ్యాగ్‌జైన్‌తో పాటు కె.ఈశ్వర్‌రావు, వట్టశాల విద్యాసాగర్‌రావులు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్‌పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బోసేల్, జస్టిస్ ఎస్.రవికుమార్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం స్మితాసభర్వాల్‌కు నోటీసులివ్వలేమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంలో పని చేసే అధికారి ప్రతిష్టకు ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినదే అవుతుందని, ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంలో తప్పేమీ లేదని ధర్మాసనం ప్రభుత్వ చర్యను సమర్ధించింది. ప్రభుత్వం కేసు దాఖలు చేసే విషయంలో అధికారికంగా సంబంధిత అధికారికి అనుమతి ఇస్తుందని, ఈ పరిస్థితిలో నోటీసులివ్వలేమని తెలిపింది. అవసరమైన సమయంలో తప్పకుండా జారీ చేస్తామని కూడా తెలిపింది. ఔట్‌లుక్ మ్యాగ్‌జైన్ తరఫున దాఖలైన క్వాష్ పిటీషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని, ఆ పిటీషన్‌పై తీర్పు రిజర్వులో ఉన్నందున ఈ పిల్స్‌పై విచారణను అప్పటి వరకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అనంతరం కేసు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.