స్మృతి లయలు

కొత్త పంథాలో సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1959లో ఊతం ధొరికింది!
ఇప్పుడు నా గుండెల్లో యూనివర్సిటీ - జేవిడీ కాలేజీ - దాని మీద చతుర్ముఖ గడియారం సమీపంలోనే ఘార్ణిల్లే సముద్రం వాల్తేరు అప్ ల్యాండ్స్ ఇవన్నీ మోయలేనంత భారంగా ఉన్నాయి.. తొలిమలుపు భారాన్ని దింపెయ్యాలి/ చిన్నప్పటి నుంచి రాస్తున్న ఓ.. అదే పనిగా ప్రగల్భాలు పలుకుతున్న కవిత్వం నన్ను నిలదీస్తున్నది. నా హృదయాంతరంలో - ఇదేనా. నీవు ప్రగల్భాలు పలికేవు.. అని లోపలి నుంచి గోల. ఒక శీర్షిక: నన్ను పాతిపెట్టి/ నా మీద కట్టండి/ కొండంత గోరీ/ కదలి వచ్చి మీ వికారానికి అద్దాన్నవుతాను/ నన్ను ఆకలికి/ అన్యాయానికి ఎరచేసి/ ఊరవతల నా/ ఆశయాలకి నా ఆశలకి/ చితి పేర్చండి/ బుగ్గి చెయ్యండి/ మీ గుండెల్లో/ భాస్వరమై/ మీ కళ్లల్లో/ కొరకంచునై/ మీ తప్పులెత్తి మీ చెవుల్లో/ సీసం పోస్తాను/ నన్ను.. కోసి బస్తాలకెత్తి/ బరువు గట్టి పాతాళంలో తొక్కండి/ తిమింగాలకి విష నాగులకు/ పంచండి/ తిమింగలమై/ విష సర్పమునై/ మీ పాపం బద్దలు చేస్తాను/ లేచి వచ్చి మీ ఎద కాటేస్తాను/ చీకటిలో నుంచి/ వెలుగునయి/ చీకటి మీ లోపాలను/ చితగ్గొట్టి తెరకెక్కిస్తాను/ నన్ను చంపండి/ మీ పాలిటి పిశాచాన్నవుతా/ (స్వతంత్ర 1958) - అట్లాగే, పనె్నండవ ఏట రాసిన - స్వోత్కర్ష వివిధ పత్రికలూ ఆదరించి వేసిన - చిన్న నోట పెద్ద కూతగా రాణించిన ఈ కవిత - నా కలం/ నా గళం/ పలగాలి/ కూలివాడి గుండెల్లో/ ఆందోళన/ గుమాస్తా/ మస్తిష్కంలోని/ ఆవేదన/ వ్యధి తజనావళి/ కంఠంలోని/ ఆవేశం/ శిథిలం కాబోయే/ శిల్పి హృదయం /పతనమై పోతున్న/ రైతు బ్రతుకు/ ... ఇలా కొనసాగి, కొన్ని స్టాంజాల తరువాత - నా కాలం/ నా గళం/ అనునయించాలి/ అనువదించాలీ/ పసికూనల/ పెదవులందున/ మెరిసే ఆనందం/ ప్రకృతి ఒడిలో/ మెరిసి మురిసే శాంతం/... లాంటి కవితాభినివేశం - సామాజిక స్పృహ లాంటిది ఏదో ఉంటుందన్న జిజ్ఞాస మీదికి చూపు పారింది. వార్తాపత్రికల మీదకి గాలి మళ్లింది. మాత్రా ఛందస్సు వద్దు/ వచన కవిత్వమూ అక్కరలేదు.. ఏ గ్రామరు అక్కరలేదు, దుష్ట సమాసాల గోలా లేదు. హాయిగా ‘గిరీశం భాష’ (న్యూసు భాషకి మా ముద్దు పేరు అది) రాసేయ్యొచ్చును.. రాసేడన్నా.. రాశాడన్నా.. లేదా రాసిండన్నా.. ఒకటినన్నా, గాలి, అట్లా కవితల మీద నుంచి కథల మీదకి మళ్లింది. పెద్ద వారపత్రిక ఆంధ్రప్రభలో (53) నా తొలి కథ బైజుబబరాకి బొమ్మ కూడా వేశారు. ఎనిమిది రూపాయలు కూడా ఎం.ఓ చేశారు - ప్రభ డైలీ మీద చిన్నప్పుడే మోజు ఉండేది. సరే, సమ్మంధం అనాలా? సంబంధం అని రాయాలా? - పేర్ల్ ఎస్‌బక్ గారి ‘ఆదర్ గాడ్స్’ సోమర్సెట్ మాం గారి నవల్స్‌ని తెచ్చుకొని చిన్నప్పుడు నేనూ కాకర్ల, పార్కులో తంటాలు పడేవాళ్లం. నవ్వొస్తుంది ఇప్పటికీ - సోమర్సెట్ మాఘం అని ఉచ్చరించాను. నాన్నగారు కరెక్ట్ చేశారు - భళ్లున నవ్వుతూ. ఇవాళ విల్లియం సోరయాన్ నాకు ఇష్ట రచయితా (అమెరికన్ ఆర్మేనియన్ రైటర్) నేనూ నవలలు రాయాలి - స్టాప్ పొయెట్రీ. పైగా రేడియో ఆదరణా దొరికింది. మనసు మారిపోయింది. వెర్రి వ్యామోహం ఉన్న ఫిజిక్స్‌ని విరక్తితో పక్కకి నెట్టేశాను. అదేనా? -నేను అమ్మానాన్న పెట్టిన పేరు - క్యాంపస్ డిగ్రీ - ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాయాలన్న కోరికా అన్నీ వదిలేసాను.
‘శరీరం అదే గాని లోపల ఆత్మని మార్చవచ్చును రా.. మురళీ’ అన్నాను. ‘కరెక్ట్. నేనూ పాత మురళిని కాను ఎస్జీకేయంధర్ని - మిలిటరీ వాణ్ణి దేశం కోసం చస్తా -ఇవాళ చస్తే రేపు రెండూ...’ అన్నాడు. ఇవాళ చస్తే రేపు రెండు అన్నది వాడి ఊతపదం. స్కూల్‌మేజ్. నిజానికి నా బాడీగార్డ్. వాడికి చదువుకోడంకన్నా - వ్యాయామం సంగీతం, క్రాఫ్ట్ వర్క్స్ అవీ ఇష్టం. వాళ్ల నాన్నగారు రైల్వేస్.. నాటకాలలో వేసేవాడు. తన అన్నయ్య కారణంగా వాడికి ఇంట్లో ఆదరణ నిల్. కాకపోతే వీడు ధైర్యం - పరోపకార బుద్ధి కలవాడు. ‘గుడారమెత్తి వేశారు’ పాట. పుష్ప విలాపం, బహుదూరపు బాటసారి లాంటి ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్‌ని ‘అచ్చం’ - అట్లాగే పాడేవాడు. మా మామ్మకి వాడు ‘పెట్’ అయ్యాడు. తెల్లారగట్ల లేచి వచ్చి రెండున్నర మైళ్లు నడచి ఒక్కోసారి మా మామ్మకి సాయంగా కూడా వెళ్లి, అక్కడ కృష్ణా తీరాన - గొంతు సాధన చేసేవాడు. మిరియాలు నమిలేసేవాడు.. ఘంటసాల అంటే మా మామ్మకి అంతులేని ఇష్టం. ‘బామ్మగారూ.. వచ్చేశా’ అనంగానే ‘రారా! మురళీ! రా.. ఇదుగో ముందో నాలుగు ముద్దలు చద్దన్నం అంటే తరవాణి అన్నం తిను. గూన ఆవకాయ ముక్కా వేసీదా?’ అనేది. ఘంటసాల అంటే ఆవిడకి అంత అభిమానం ఉండటానికి కారణం ఉంది. ఈ మధుర గాయకుడు విజేనగరంలోనే సంగీత కళాశాలలో సంగీత విద్యాభ్యాసం చేశాడని తెలుసుగా. సంస్థానంలోనే మా తాతగారికి - అందునా మ్యూజిక్ కాలేజీ సూపర్‌విజన్ ఉద్యోగమట. సదరు కాలేజీ హాస్టల్లో ఓ పూటే భోజనం. రెండో పూట వారాలబ్బాయిగా ఓ బ్రామ్మల ఇంట రాత్రి భోజనం చెప్పుకోవాలి. అట్లా మా తాతగారి ఇంట ఘంటసాల వారు వారానికి ఓ పూటకి వారాలబ్బాయిట. మా సొంత తాతగారి రూపు రేఖా విలాసాలు మాకు తెలియవు. ఫొటో లేదు. నేను తాత గండాన పుట్టానుట. నేను పుట్టిన మూనె్నల్లకే సుబ్బారాయుడు గారు - అయినా మా నాయనమ్మ సుబ్బమ్మగారు నన్ను కంటికి రెప్పలాగా సాకిందని మా అమ్మ చెప్పేది. మురళి ఘంటసాల పాటల పుస్తకం మేము ఆంజనేయ దండకం పెట్టుకున్నట్టు, జేబులో పెట్టుకొనేవాడు. వాడు మిలిటరీ (ఎయిర్‌ఫోర్స్)లోకి వెళ్లిపోయాడు. నేను క్యాంపస్ నుంచి వచ్చానని తెలిసి వచ్చాడు. ‘కృష్ణా నువ్వు సినిమాలలోకి పోవాలిరా. జ్ఞాపకం ఉందా? అమ్మా..! ఓ కొండవాడు వచ్చి మనోడి చేయి చూశాడోసారి.. వీడు చలనచిత్ర లోకంలోకి పోతాడు.. అని చెప్పలే? అమ్మ అదోలా నవ్వింది. ఔనౌను. వాడింకా ఏవేవో చెప్పాడు. మీవాడికి రెండు ‘పెట్టలు’ ఉంటారని. చెన్నపట్నం వెళ్లిపోతాడని కూడా చెప్పాడు మురళీ! కాని, కుక్క నోట్లో ఉంటాయా? తారాబలాలు? వద్దులే వాన్ని వదిలి నేను ఉండలేను అబ్బాయ్?’ అని మళ్లీ నవ్వింది బేలగా.. ‘వాడు హీరో అయితే నేనే ప్లేబ్యాక్ పాడుతా.. అదరగొడతా’ అన్నాడు’ ‘సినిమా మోజు లేదురా నాకు’ అన్నా. కారణాలు వేరు. కానీ ఓ మాస్క్ తీసేసినట్టు మరో మాస్క్ పెట్టుకున్నట్టు - కథలు పుంజానుపుంఖాలుగా రాయడం మొదలెట్టా.. వీరాజీకి అభిమానులు పెరగసాగారు.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com