స్మృతి లయలు

‘పత్రిక’లో ప్రవేశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1938 తెలుగు ఫత్రికా రంగంలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారు అస్తమించడం - రామనాథ గోయెంకా గారి ఆంధ్రప్రభ డైలీ ‘్ఢమ్మ’ని అవతరించడం జరిగాయి. దీంతో శంభు ప్రసాద్ గారి మీద చారిత్రాత్మకమైన గురుతర బాధ్యత - ఒక పర్వతశ్రేణి విరిగి మీద పడ్డట్లు పడ్డది. అయితే అయ్యవారు ఆంధ్రపత్రిక పగ్గాలు పట్టుకున్న తరువాత కొంతకాలానికి ఈ భూమీదికి డౌన్‌లోడ్ అయిన నేను ఇదంతా అనుభవంతో గాక అధ్యయన పటిమతో మాత్రమే చెప్పగలను.
అనుభవంలో నా జీవితాన్ని కొత్త రోడ్డెక్కికంచిన అసలు ఘట్టం (1961) ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ‘నాన్నగారు (శంభుప్రసాద్ గారు) మిమ్మల్ని చూస్తాం, అన్నారు. రేపు ప్రొద్దుట పదకొండు గంటల వేళ పోయి కలుసుకోండి. నేను క్రింద (టైమ్ కీపర్‌కి) చెప్పి పెడతాను’ అన్నాడు రాధాకృష్ణగారు.
ఇంచుమించు పది పనె్నండు మాసాలుగా, ఈ పత్రికా భవనాన్ని ‘ఐ’ కోణంలో - ఆంధ్ర ఇన్‌స్యూరెన్స్ బిల్డింగ్ మీద నుంచి చూస్తూనే వున్నాను గానీ, తొలిసారి, లోపలికి వెళ్తున్నప్పుడు - సంకోచం, బిడియం వెనక్కి నన్ను లాగుతున్నట్లుగా వున్నది. కానీ అదే ‘ద్వారమార్గం’లో లోనికి నెట్టివేయబడుతున్న పెద్ద న్యూస్‌ప్రింట్ రోల్ వెనుక నించి నన్ను తరిమి లోనికి త్రోసినట్లయింది. టైమ్ కీపర్ చక్రపాణి అడ్డుపడ్డాడు. ‘అయ్యవారు రమ్మన్నారు’ చెప్పాను.
‘్ఫస్ట్ఫో్లర్’ అన్నాడు. ‘వీడేదో ‘ఇంపార్టెంట్ శాల్తీ’ అనుకున్నాడు కాబోలు! లేకపోతే, వాడొక ఆల్సేషన్ డాగ్ లాగా అడ్డం పడిపోతాడు అందరికీ. కుంచిత పాదం అనగా జెనరల్ మ్యానేజర్‌గారి ‘సీక్రెట్ ఏజెంట్’ట రుూ చక్రపాణి - అని తర్వాత వర్కర్‌లు చెప్పగా విన్నాను.
నాలో కొంత కాన్ఫిడెన్స్ ఉంది అప్పటికే. ఎందుకంటే మా రోజుల్లో ‘్భరతి’లో ‘పడడం’ అంటే - రచనా రంగంలో ఓ మిద్దె మీదికి ఎక్కడం లాంటిదే. శివలెంక శంభుప్రసాద్‌గారు, నా రచనలు అప్పటికే ‘్భరతి’లో వేశారు. ఆయనగారి ‘గది’లోకి సింహం బోనులోకి ప్రవేశించే మేకపిల్లలాగ ప్రవేశించాను. ఇప్పటికీ నాకు ఇష్టంగా, స్పష్టంగా దృగ్గోచరం అవుతూనే వుందా సన్నివేశం.
‘వారు’ ఇలా తలత్రిప్పి చూశారు. అదో ఫ్లాష్ బల్బ్ వెలిగినట్లయింది. ఒత్తయిన కనుబొమలు, బాగా వెడల్పుగా సాగిన కనురెప్పలు, వాటి క్రింద తీక్షణమైన చూపులు బరిపే కనులు, కోటేరేసినట్లు ముక్కు, విశాల ఫాలభాగం పైకి పోనుపోను కొంచెం కొంచెంగా పల్చబడుతున్న వెండి వెంట్రుకలు తొంగిచూసే పల్చని, చక్కగా దువ్విన క్రాపింగు - ఆయన చెవులు దొప్ప చెవులు, పెద్దవి. మరీ అత్యవసరంగా పెద్ద భారం భుస్కంధాలపై పైకెత్తుకొన్న కారణం చేతనేమో? మరి, కొంచెం వాలిపోయినట్లున్నాయి (డ్రూపింగ్) భుజాలు - చేతులూ, వ్రేళ్లూ కూడా క్లాసికల్ స్టైల్లో వున్నాయి. ఆయన ఎదురుగ్గా, నా నవలల కాపీలు, కొన్ని క్లిప్పింగ్సూ కూడా వున్నట్లుగా వుంది.
‘మా వాడు చెప్పాడు’ అన్నారు. సాలోచనగా చూస్తూ, మళ్లీ అన్నారు ‘ఏదో చెపుతారే. ‘బెడ్ ఆఫ్ రోజెస్’ అని.. అంటే, తెల్సా?’
‘గులాబీ పూల పాన్పు సార్.. కానీ దానికి ముళ్లు కూడా ఉంటాయి అని...’ నసిగాను.
‘విప్లవం ఇష్టమా? తిరుగుబాటు చెయ్యాలంటుందా, మీ కలం?’ గ్రుచ్చుకుంటున్నాయి ఆయన చూపులు.
‘సార్! ఒక తిరుగుబాటు ‘గెలిస్తే’ విప్లవం అంటారు సార్! నాకు వ్యక్తి చైతన్యం మీద నమ్మకం ఉంది సార్! కమ్యూనిస్టులు సామూహిక తిరుగుబాటు కోరుతారు’ అన్నాను.
దీంతో ఆయనకి నా మీద వచ్చిన ‘కమ్యూనిస్టు’ని అన్న రిపోర్టులు పటాపంచలయినట్లున్నాయి.
‘ఉద్యోగం అంటే, కావాలని బేడీలు వేయించుకుని జైల్లోకి పోవడం అంటారు కదా?’ అని నవ్వేశారు.
‘బేడీలు లోపలికి పోంగానే తీసేస్తారు కదా, సార్!... స్వేచ్ఛగా రాసుకుంటూ (రచనలు) పొట్టతిప్పలు పడే మంచి దారి ఇదేనేమోనని..’ ధైర్యం పుంజుకున్నాను. పాతాళభైరవిలో ఎన్టీఆర్‌లాగా, చేతులు కట్టుకుని నిలబడ్డాను (మొహం తుడుచుకునే ధైర్యం లేదు.)
‘ముక్కు నేలనిబెట్టి రాస్తారు తెలుసా?’ పకపకా నవ్వుతున్నారు.
‘మా వాడు (రాధాకృష్ణగారు) వీక్లీ ఎడిటింగ్ భారం మొత్తం మీద వేసుకున్నాడనీ, మీ మీద కనే్నశాడనీ తెలిసింది’ అంటూ, ‘అంతా వెళ్లిపోయారు, ఇక అంతా కొత్త నీరే’ అన్నారు.
భయం భయంగా చూశాను. ‘నాకు వీక్లీ యిష్టం లేదు’ అని, ఆయనకి గట్టిగా వినిపించేలాగా సైలెంట్‌గా చెబుతున్నట్లుగా ఉంది నా ‘మొహం’. (కానీ ‘వీక్లీ’యే, నాకు నేటికీ పేరు తెచ్చింది) నాకు బాబూ రాజేంద్రప్రసాద్; అదే - బెజవాడ ఏజెంటుగారబ్బాయి చెప్పారు - వీక్లీ అయితే కట్టలు కట్టలు కథలు సంకలో పెట్టుకుని ఇంటికి ఎత్తుకుపోయి తెల్లార్లూ చదవాలి. పేజీలకు పేజీలు ప్రూఫ్‌లు దిద్దాలి’ (బాబోయ్!) అని. నాకు అలా దినపత్రిక మీద మోజు పెరిగిపోయింది. అక్కడ బోలెడు మంది ప్రూఫ్ రీడర్లు బల్ల వేసుకుని (విశాలాంధ్రలో, ఆంధ్రప్రభలో చూశాను) కూర్చుని ప్రూఫ్ రీడింగ్ చేస్తూంటారు. మనకా పని తగలదు...
ఈలోగా అయ్యవారి గదిలో, వెనకాల వున్న చిన్న తలుపు త్రోసుకుని, ‘లాఫింగ్ బుద్ధా’ విఅగహంలాగా వున్న, నుదుట గంధాక్షితలు ధరించి, గ్లాస్కోమల్లు పంచె, జుబ్బా ధరించిన ‘సారు’ ఒకరు, వస్తూనే అయ్యవారికి నమస్కరించి, నోటి మీద వ్రేలేసుకుని నిలబడ్డాడు. నాకు అర్థం అయిపోయింది. అతడు జెనరల్ మ్యానేజర్ (పెద్ద బుర్రవాడు) అని. అంతేనా? అయ్యవారి రూమ్‌లో ఎవరికేనా నిలువు జీతమే. (వారింటికి పోతే మాత్రం కుర్రవాణ్ణి అయినా కూర్చోబెట్టి, ఆయన నిలబడి కూడా కాదుకాదు అటూ ఇటూ పచార్లు చేస్తూ మాట్లాడతారు) ఇంగ్లీషులో చెప్పారు, జి.ఎం.కి - ‘ఈ అబ్బాయికి ఎడిటోరియల్ హాల్లో ఓ బల్లా కుర్చీ ఎరేంజ్ చెయ్యండి. నేను రాధాకృష్ణతో మాట్లాడుతాను’ అని, తిరిగి -‘మీ కిష్టమైన టాపిక్ మీద, నాలుగు పేజీలు దాటకుండా, ఓ వ్యాసం రాసి, శ్రీరాములు గారికి, (తెలుసా ఆయన మీకు? - నేను తల అడ్డంగా నిలువుగా ఊపా, తెలుసునన్నట్లు) ఇవ్వండి. మళ్లీ నేను పిలిచేదాకా, నన్ను కలవనక్కరలేదు’ అంటూ, ఎదురుగా వున్న ‘ఎన్‌కౌంటర్’ పత్రిక ఒకటి నావేపు త్రోసి, ‘ఇది చదవండి. శుభం! పోయిరాండి!’ అన్నారు. ‘ఎన్‌కౌంటర్’ పత్రిక ఇచ్చారంటే నన్ను ఓకే చేశారన్నమాట!
తలుపు తీసుకుని బయటపడ్డ నేను, ఆయన గదికి వున్న రెండు దిమ్మ మెట్లలో, పై మెట్టు మీద కూర్చుండిపోయాను - కాళ్లు విదిలించుకున్నాను.
డైలీ ఇన్‌ఛార్జ్ పోలవరపు శ్రీరాములు గారికి దండం పెట్టాను. లక్కపిడత నోరు ఇలా పెట్టి వాత్సల్యభరితంగా నవ్వారు. ‘వ్యాసం రాసి రేపు తెండి. తొందర లేదు. అయ్యవారు చెప్పారు. అదో ఫార్మాలిటీ. మీరు రాధాకృష్ణ ఫ్రెండుటగా? నాకు అంతా చెప్పాడు తను’ అన్నారు. ప్రసన్నంగా చూశారు నా వైపు. (రేపటి దాకానా సస్పెన్స్?)
‘ఇప్పుడే రాస్తాను సార్! ఇక్కడే, ఈ బల్ల ఖాళీగా వుందిగా, అన్నట్లు’ ఆశగా చూశాను. ‘సరే’ కాగితాలు అక్కడ పెట్టించారు. అప్పుడు రాధాకృష్ణగారు ‘మా వూరి సమస్య’ అంటూ, ఓ డైలీ ఫీచర్ నడిపిస్తూ, గ్రామాల నుంచి వచ్చిన ఉత్తరాల ఆధారంగా ‘సమస్య’ని ఒకటి, రెండు వాక్యాలలో రాసి, వేస్తూ ఉండేవారు, డైలీలో. ‘అమృతాంజన్’లో ఆయన దగ్గర నేనా ఉత్తరాల కట్టలు చూశాను. కొన్ని చర్చించాం కూడా. పేపర్లో పడ్డ లెటర్‌కి మెరిట్‌ని బట్టి - డైలీ పత్రికని - నెల నుంచి మూడు నెలలు, ఉచితంగా, ఆ లెటర్ రాసిన వ్యక్తికి పంపేవారు.
‘మా వూరే ఓ సమస్య’ అంటూ - బెజవాడ ప్రాబ్లెమ్స్ మీద వో చమత్కారమైన ఆర్టికల్ వ్రాశాను. ‘సార్, ఇదిగో’ అన్నాను. ఆయన, నే రాసిన కాగితాలు అటూ ఇటూ త్రిప్పి చూసి, మొదటి పేజీ టాప్‌లో మూడు టిక్కులు పెట్టి, బల్ల మీది ఫైళ్ల గుట్ట ప్రక్కనున్న ట్రేలో పడేశారు.
‘రేపు ఉదయం పదిన్నరకి వచ్చేయాలి. నేను పదకొండుకి వస్తా. ఈలోగా, ఎవరితో మాట్లాడొద్దు. అదుగో, ఇప్పుడు కూర్చున్న బల్ల ‘మీదే’ (ఆనుకుని వున్న కుర్చీలో అని అర్థంలెండి) కూర్చుని మన పేపర్స్ ఫైల్ చూస్తూండాలి. బైదిబై, మీ నాన్నగారికి చెప్పేసి రాండి’ అన్నారు. చల్లగా హాయిగా చూశారు.
అంతే! నాదో అప్లికేషన్‌ని, నేను ‘టపా’లోగానీ నేరుగా గానీ ఇవ్వలేదు. అప్పటికి కానీ, అధికారికంగా ‘ఇంటర్వ్యూ’ (్థంక్స్ టు రాధాకృష్ణగారు) అయిపోయింది. శ్రీరాములుగారు గానీ, మరొకరు గానీ మళ్లీ క్రాస్ ఎగ్జామిన్ చెయ్యలేదు.
నాకు నిజమా? కలా? అన్నట్లుంది. ‘డైలీలోనేగా వేశారు. వీక్లీ కాదుగా?’ అనుకుంటూ, క్రిందికి, ఎవరో తరుముతున్నట్లు దిగిపోయాను. హాలులో, అందరూ వింతగా చూస్తున్నారు నన్ను.
పనె్నండున్నర అయిందప్పుడు. మా బిల్డింగు లిఫ్ట్ కూడా ఎక్కకుండా - నాన్నగారి గది టాప్‌ఫ్లోర్ గది, రూమ్ నెం.19కి మెట్ల మీద ఎగిరి ఎగిరి ఎక్కుతూ, రూమ్ తాళం తీసి, లోపలికి ఒగరుస్తూ పోయి కూలబడ్డాను.
నాన్నగారు మవుంట్ రోడ్ ఆఫీసులో కదా వుంటారు - ఆయాసం తగ్గింది.
‘నాన్నగారూ! రేపట్నుంచీ రమ్మన్నారు. సారీ టు డిస్ట్రబ్‌యూ’ అని ఫోను పెట్టేశాను. వెంటనే మళ్లీ రింగయింది. నాన్నగారే - ‘విజయా లాడ్జ్‌కి పోయి భోజనం చేసి వచ్చాకా, అమ్మకి కార్డు రాసి పోస్ట్ చెయ్యి. శుభం! నేను వచ్చాకా డీటైల్స్ చెబుదువుగాని’ అని పెట్టేశారు ఫోన్.
గుడ్ బై టూ ఫ్రీడమ్! గుడ్‌బై టు లవ్! వెల్‌కమ్ టు ‘గ్రైండిగ్ స్టోన్’! ముక్కు తడుముకున్నాను (అయ్యగారు కనపడ్డారు) ‘ఆంధ్రా యూ’ క్యాంపస్‌లోని చతుర్ముఖ గడియారానికి కూడా గుడ్‌బై! అది ఫేడవుట్ అయింది (?!) వెల్‌కమ్ టు ‘జైంట్ లైట్ హవుస్!’ ‘గుడ్ బై టు డ్రీమ్స్!’ వెల్‌కమ్ టు లైఫ్’! ద హార్డ్ రియాలిటీ’... ఖేసరాసరా.
వోరగా తీసి వున్న (మా) గది తలుపు దగ్గరికి వెళ్లి, భడాలున మూసేశాను. తిరిగి కుర్చీలో కూలబడ్డాను. కనులు చెమ్మగిల్లాయి. మొదట ఆనక కనుకొలుకులు నిండేయి. ఆ తర్వాత తెలీకుండానే వెక్కివెక్కి ఏడ్చాను. (తరచుగా మా బెజవాడలో నేను ఈ మధ్య వింటూ వచ్చిన మాట - ‘వర్కింగ్ జర్నలిస్ట్’. ఓహోయ్! అదే నేను అవుతున్నానన్నమాట! అంతేగా జీవితం? అనుకున్నది ఒకటీ అయ్యేది మరొకటి. ‘ఖేసరాసరా వాట్ విల్‌బి విల్‌బీ, ఫ్యూచర్ ఈజ్ నాట్ అవర్స్ యుసీ...’ అన్నట్లు...
అయ్యవారు ఇలా ‘్ఛలెంజింగ్’గా చూసి అడిగారు ‘ఏమిటీ, ఖేసరాసరా?’ అదో మాదిరిగా నవ్వుతూ.
‘ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన చిత్రం సార్! ‘ది మ్యాన్ హూ న్యూ టూ మచ్’ సినిమాలోది సార్! 1956లో విడుదలయింది. ‘స్టూవర్ట్ స్ట్రేంజర్, డోరిస్‌డేలు నటించారు. అందులో ఈ ‘ఖేసరాసరా’ పాట డోరిస్‌డే అద్భుతంగా పాడింది’ అని చెప్పాను పాఠం అప్పజెప్పినట్లు.
ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్స్ పార్కులో మధ్యాహ్నం లంచ్ అవర్‌లో, లౌడ్ స్పీకర్‌లో వినిపించడానికి, ఈ ‘రికార్డు’ మేం కొన్నాం. ఇందులో కథ కొంతే అయ్యవారికి చెప్పాను. తర్వాత అదే నాకు ‘మాటో’ అయింది. ఫ్రెండ్స్ అందరం ‘ఖేసరాసరా’ అంటే ‘ఖేసరాసరా’ అనుకునేవాళ్లం. ఒకళ్లనొకళ్లు గ్రీట్ చేస్తూ. ఏం లేదు ఆ మాటకి పెద్ద తాత్పర్యం ఏమీ లేదు.
‘యద్భావం తద్భవతి!’ అని పెద్దలంటూండే మాటే!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com