స్మృతి లయలు

రాజసులోచన ప్రత్యేకత ఏమిటి? -82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే, తెర మీధ తెర వెనుక శీర్షికకి -అంజలి, భానుమతి, సావిత్రిల సరసన -నాట్య తారకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాము -కారణం ఈ మాటలోనే వున్నది- ఆమె నాట్యతార-కేవలం సెట్స్ మీదనే కాదు - నిజజీవితంలో కూడా ... తన ట్రూప్‌తో దేశంలోనూ విదేశాలలోనూ కూడా పర్యటించాలి. నటులకు ఎవరవ్వనీండి , సన్మానం జరుగుతున్నది అంటే అది తాడేపల్లిగూడెం అయిన తెనాలి అయినా ఈమె తన టీముతో అక్కడ ప్రదర్శన ఇచ్చి -సదరు సన్మానానికి పరిపుష్టి ఇచ్చేద. ఔను- గజ్జే కట్టింది అంటే ఘల్లు మని-ప్రేక్షక హృదయాలని ఝల్లు మనిపిస్తుంది రాజీవలోచన. రా.సు. గ్లామర్ పుష్కలంగా వున్నా శాంతినివాసంలో -రావే రాధా రావే రాణి పాటలో అక్కినేని తో రాధగా నృత్యం చేసి -అలరించిన రాజసులోచన బెజవాడ అమ్మాయి. గ్లామర్ పుష్కలంగా వున్నా నాట్యకత్తెలు దరిమిలా సినిమాల్లో (తెర మీద ఫీచర్ నుంచి కోట్ చేస్తున్నాను.) పెద్ద నటులై రాణించడం పెద్ద అబ్బురం ఏమీ కాదు గాని నటిగా స్థిరపడ్డాక ట్రూపుతో టూర్లు చేసి కష్టపడి ప్రదర్శనలు ఇవ్వడం ఒక నటి యొక్క ఆశయాన్ని సూచిస్తుంది. నేను ఈ మధ్య -రాజసులోచనను మూడు మాసాల తేడాలో రెండు సార్లు కలుసుకున్నాను - తన ఆశయం నాట్య వ్యాప్తి- గజ్జెకట్టి దేశ విదేశీ పర్యటనలు చేయడం ఇష్టమని చెప్పింది- అయితే మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలో ఆమె అద్భుతంగా నటించి ఉత్తమ నటి అవార్డు అందుకుంది... ఇంటర్వ్యూ వేళకి ఆమెకి తెలుగు తమిళ కన్నడ హిందీ సినిమాలే ఒక తొంభై దాకా ఉన్నాయి. ఈ ఫీచర్ నా కష్టార్జితం -పెద్ద తారలు -అంజలీ గారు ప్రభృతుల సరసన నేనూ వస్తున్నాను..అని సంతోషించింది.
మద్రాసులో నృత్యం నేర్చింది- అసలు వాళ్ళ వూరు చిత్తూరు కానీ వాళ్ళ నాన్నగారు రైల్వే ఉద్యోగం కావటాన బెజవాడలో పుట్టి మద్రాసులో మెట్టింది. తనకి వేరే వ్యాయామం ఎందుకు? డ్యాన్స్-అభ్యాసం వున్నది అదే చాలు అని చెప్పింది. కాకపోతే ఓ చిన్న కోరిక తీరలేదు- వీణ వాయించాలని యమా కోరిక. తీరలేదు. తీరిక దొరికితే డిటెక్టివ్ బుక్స్ చదువుతుంది ...ట. లక్కీగా జపాన్ లో నాట్య టూర్ చేస్తున్నప్పుడే -ఆమె విశ్వవిఖ్యాత అల్ఫ్రెడ్ హిచ్‌కాక్‌ని కలుసుకుంది-అదో అపురూపమైన అనుభవం -హిచ్ గారు కుశల ప్రశ్నలు గట్రా వేసి మీ సూర్యకుమారి ఎక్కడ వుంది ? అని అడిగారుట... సూర్యకుమారి అంటే ఉదయమ్మాయేను ... స్వేచ్ఛా భారత ఉదయం మాయెన్ అహో .. పాట స్ఫురిస్తుంది... నా చిన్నప్పుడు - బెజవాడ లో బ్రిడ్జి జంక్షన్ లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విగ్రహం అవిష్కరించినప్పడు -(వాళ్ళ పేద్ద తాతగారేగా) వచ్చి కచేరీ చేసింది ఆ మధురగాయని -అదో తిరణాల లాగ జ్ఞాపకం వుంది. మా చిన్నాన్నగారు -నన్ను తన భుజాల మీదకి ఎక్కించుకొని, స్టేజీ చూపించారు- మరీ బులోన్ని గానీ సూర్యకుమారి పాటలన్నీ నాకు మా మేనత్త సత్యం కారణంగా కొట్టినపిండి. సరే... అది అట్లున్దనిండు... ఊ రండి రండి ..వచ్చారా? నేను ఎదురుచూస్తుంది మీ కోసమే.. నాకు నవ్వొచ్చింది..
ఎదురుచూస్తుంది??? నేను ‘‘చూళ్లేదని లాంటి మాటలు చాలా ముద్దుగా పలుకుతుంది...
నా నవవు పట్టేసింది ఆమె. చూడ లేదనీ అనాలి అని ఈయన కూడా చెపుతుంది సారీ .. చెబుతారు. అని వెడల్పుగా నవ్వేసింది. ఈయన అంటే రావు చిత్తజల్లు గారు.. నాకు రా.సు ‘పాత ఒకటి గుర్తుంది.’’ పిల్లా పిల్ల రా !!... పెళ్ళిచేసుకో అన్నాడు కుర్రాడూ... పసిబాలుడు.. అన్నపాట. పసివాడు కాదు గాని -సీఎస్ రావు ఆమెని అట్లాగే వెంటాడి పెళ్ళిచేసుకున్నాడు. ఆ రోజు పత్రికా ప్రతినిధులతో రావు -ఉబ్బితబ్బిబ్బు అయిపోతూ చెప్పాడు - రాజసులోచనను చాలా మంది పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కాని ఆమెదొక జీనియస్ బుర్ర- బహు సున్నితమైన మనసు.. మేము ఇద్దరం గట్టిగా అలోచించుకొనే ఈ నిర్ణయం తీసుకున్నాము అన్నాడు. మహదానందంగా -నేనడిగాను ఊటీకేదో పోతున్నామన్నారు -ఆనక ఏదైనా పర్యటన లేదా?’’..
‘‘నాకు జపాన్‌లో నా ట్రూప్‌తో పర్యటించాలని వుంద’’ని చెప్పింది అంతలో ఎవరో వచ్చారు. నేనీ మధ్య నా గీతాంజలి ట్రూప్‌తో ఎయిడ్ ప్రదర్శనలు ఇస్తున్నాను -ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు- అసలు పేరు రాజీవలోచన అయితే -అరవ స్కూల్లో రాజసులోచన అని రాసేశారట . ఇంట్లో సింప్లిసిటీ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ టు బ్యూటీ అన్నట్లున్నా బయటికి పోతే చీర జాకెట్ దగ్గనుంచి మ్యాచింగు ఉండాల్సిందే. కూచిపూడి అభిమాన నాట్యం. ఇంటవద్దనే పుష్పాంజలి నృత్య కళాకేంద్రం పెట్టి ఏడాది అయింది.
స్టేజి మీద నృత్యం చేసున్నప్పుడు థ్రిల్ వస్తుందా? లేక సినిమాలో నృత్య సన్నివేశాలలో వస్తుందా? అన్నాను.
వాస్తవానికి స్టేజి మీద ఆడియన్స్ రియాక్షన్స్ స్టడీ చేస్తూ తదనుగుణమైన దరువులు వేస్తూ పోతాం.. వాళ్లు ఆనందించిన కొద్దీ - మనలో ఉత్సాహం పెరిగి -ఒక అనిర్వచనీయమైన థ్రిల్ల్లూ తృప్తి రెండు కలుగుతాయి.. ఉదాహరణకి రావోయి కృష్ణయ్యా అంటూ కృష్ణున్ని పిలిచే గోపిక నృత్యం చేస్తున్నాను అనుకోండి.. చెయ్యి చూపి ఆడియన్స్‌లోకి ఇలా రావోయ్ అనే హస్తవిన్యాసం చేస్తాం... అది వాళ్ళల్లో వెంటనే స్పందన తెస్తుంది. వాళ్లు నిరుత్సాహంగా ఉన్నారూ అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని విన్యాసాలు దరువులు వేస్తాం అన్నదామె.
ప్రేక్షకుల ఆనందం అలసటని నిస్త్రాణని పోగొట్టుతుంది అన్నదామె.
నటి-నాట్యకత్తె :
తెనుగులో ఈమే నటిగా రాణించింది.. ముఖ్యంగా ఈమె ఉచ్ఛారణ ఒక ప్రత్యేక తీరులో వుంటుంది -అదే రాణింపు అయిన చిత్రాలు వున్నాయి .. అందులో పెళ్లినాటి ప్రమాణాలున్నాయి. ఒకటి మాంగల్యబలం రెండూ -తమిళ మళయాళ హిందీ చిత్రాలలో డ్యాన్సులు ప్లస్ నటన -చూపెట్టింది. ఈ తెలుగు తారకి ద్విపాత్రాభినయం కూడా లభ్యమైంది.. కవిత అనే తమిళ చిత్రంలో ఆ ఛాన్స్ దొరికింది. వ్యాంప్ రోల్స్ కూడా వేసింది. తన పేర్కొనదగ్గ కొన్ని చిత్రాలు పెళ్ళినాటి ప్రమాణాలు ; మంచి మనసుకు మంచి రోజులు; శాంతినివాసం; మాంగల్యబలం; ఋష్యశృంగ; బండ రాముడు; చిట్టితమ్ముడు వున్నాయి. తనకు సాఫ్ట్ రోల్స్ ఇష్టమే గానీ అన్ని రకాల వేషాలు అంగీకరిస్తున్నాను అన్నది. ఇటీవల కదా ఎలాంటిది అని కాస్తో కూస్తో తెలుసుకుని తీరాలని నిర్ణయించుకున్నది. ఖైదీకన్నయ్య ; మాంగల్య బలం లోని పాత్రలలో - ఒక రకమయిన సెక్స్ అప్పీల్ వున్నది. అది రాణించింది. ఏ.వి.యం వారి చోరి చోరిలో హాస్య నటుడు భగవాన్ ప్రక్కన సరసంగా నటించింది... దరిమిలా రేలంగి పక్కన కూడా బహు రంజైన హాస్యాన్ని అందించింది.
సితారోనే్సఆగే అనే హిందీ చిత్రం ఆమెకు అఖిలభారత నటిగా ముద్రవేసింది. ఆమె నటించిన శభాష్ రాజా చిత్రం ఢంకా బజాయిచ్చింది కానీ ఆమెకి -మంచి మనసులలో జానకి పాత్ర అంటే ఇష్టం..
ఆమె రంగూన్ వెళ్లి స్టూడియో తీరును పరిశీలించి వచ్చింది. వాస్తవానికి 1960 లో కాబోలు జపాన్, సైగాన్‌ల పర్యటన బ్రహ్మాండంగా చేసింది. అప్పుడు ట్రూపుతో వెళ్ళలేదు కాని టోక్యోలో ఎన్నో మరుపురాని సంఘటనలు జరిగాయి.
యుద్ధానంతరం సైగాన్ వెళ్ళిన తొలి భారత నటి కావడంతో ఆమెకి అక్కడి జనం ఘనస్వాగతం చెప్పారు. తిరుగుదలలో అనుకోకుండా మరో మరుపురాని సంఘటన ... దుర్గాబాయి దేశ్‌ముఖ్‌గారి సాయంతో ..సమాగమం -కొన్ని నృత్య ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది- డ్యాన్స్ అంటే రెడీ ఆమె..
జీవితంలో ఇల్లుకట్టి చూసింది- ఇష్టమైన మోటారు కారు కొనుక్కున్నది. తీరని కోరికలేమీ లేవు -కొత్త భర్త సియస్ రావుతో వేరే మరో ఇంట్లో కొత్తకాపురం పెట్టుకొని -ఆనందమయ నృత్యభరిత జీవనం సాగించాలని -ఇప్పుడున్న సొంత ఇంటిని కిరాయికి ఇద్దామని ప్లాను వేసుకుంటున్నది .. ఎవరేనా ఏమైనా అంటే సర్వసాధారణంగా బాగా నొచ్చుకునే సున్నిత తత్వమే అయినా సరికి సరి అని తొందరపడి తెగతెంపులు చేసుకోను అని చెప్పింది. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లూ చెప్పినవి ఒక్కోసారి నొప్పించినా - డైరెక్టర్ల మాటను డ్యూటీగా భావించి చేసి పడేస్తానని చెప్పింది. హీరో ప్రక్క హీరొయిన్‌గా సరే -బేషుగ్గా నటిస్తుంది - అలాగే హీరోయిన్ ప్రక్కన హీరోయన్‌గా అంటే సైడు హీరోయిన్ అన్నమాట- దానిని స్వీకరించి నటిస్తుంది కనుకనే ఆమె ఇప్పుడు బిజీ స్టార్.
కెరీర్; హాబీ , సంసారం ఈ త్రికోణం మీద బ్యాలన్సుడుగా వుంటానండీ అన్నది-శుభం జయం చెప్పాను -1935 ఆగస్ట్ 15 న బెజవాడలో పుట్టిన ఆమె 77 ఏండ్లు నృత్యసేవ చేస్తూ చెన్నైలో తన నృత్యశాలను వదిలేసింది- ఈ లోగా 300 సినిమాలు పూర్తి చేసుకున్నది...
ప్రభాకర్ ఫోటోలు తీస్తూ ఆమె సహకారాన్ని మెచ్చుకున్నాడు- చాలా ఫొటోజెనిక్ ఫేసు అన్నాడు- తమిళియన్స్ కి ఆమె యాక్సెంటు నచ్చుతుందిట ..చదువు గట్రా అక్కడేగా.... కాకపోతే మలయాళం యాస ‘‘నో గుడ్’’ డబ్బింగు తప్పదు - ఆమెకి ముక్కుతో పలకటం రాదు- అన్నాడు... కాంతారావు నన్ను ఫ్యాన్ మెయిల్ కోసం పాస్‌పోర్ట్ సైజు బొమ్మలు అడిగాడని మీకు తెలుసు- సారూ ఒప్పుకుంటేనే ఇవవు -అన్నాడు ఎంత మంచోడో ఆయన- బిల్లు తీసుకొను వీరాజి పే చేసును చెప్పా
అన్నాడు..-‘‘ఓకే’’ అది నా మీద పెట్టు.. మన పర్సనల్..అని అభినందించాను. విరగబడి నవ్వాడు- ధారణంగా వౌనంగా వుంటాడు.. నాకు వేరే ఐడియాలున్నాయి..
మా మలయాళీ కట్స్ నీకున్నాయి - లోకం అంతా - నిన్ను నటన కోసం వచ్చావా? అని అడుగుతున్నారుగా .. ఆ రోజు బీచ్‌లో మన కాంతారావు ఔటింగు స్టిల్స్ -కొంతమంది కేరళ బాసులకి ఇచ్చాను అన్నాడు.. క్వశ్చన్ మార్కు మొహం పెట్టాను - ప్రభాకర్‌కి నొక్కుల జుట్టు -గట్రా ఉంది కానీ -పొట్టి కొంచెం -పైగా మితభాషి..
నిన్ను హీరో చెయ్యమన్నావా? అని అడిగాను -స్టిల్ పట్రా... ఇన్నర్ ర్యాప్పర్ మీద కొడతా నవ్వేసి కొత్తరకంగా సెల్యూట్ చేసి వెళ్ళాడు. నా గుండె ఝల్లుమన్నది- ఇప్పుడు ఏ జారుడు నేలమీద కాలు వెయ్యదలుచుకోలేదు... అని మళ్ళీ ‘‘ఆః అంతా ఓ తమాషా వేలే’’- అని భుజాలు దులుపుకొని ఒక్కోమెట్టు ఎక్కి - నాన్నగారిని కొత్తగా కనిపెట్టినట్లు చూసుకున్నాను రూములోనే వున్నారు...
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com