స్మృతి లయలు

అధే ‘తొలి మలుపు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజంగా, సత్యాలే (ఆమె ముద్దు పేరు) నాకు మొదట హిందీ అక్షరాలూ - తెలుగు (మొరటు) సామెతలూ నేర్పిన గురువు. మేము ప్రొద్దుట్టే దొండపర్తి నుంచి ప్రస్థానం ప్రారంభించి - ఓ గంటకి ఊళ్లోకి ఆశీల్మెట్ట మీదుగా చేరేవాళ్లం. ఆశీల్మెట్ట ఇవాళ వైజాగ్‌లో సెంటర్ ఊరికి కాని - అప్పుడు పర్ర - చెట్టూ చేమాలేని గుట్ట. మేము కొన్ని రాళ్లు ఏరుకుని చేత పట్టుకుని - ఎలక్ట్రికల్ పోల్ లేదా టెలిగ్రాఫ్ పోల్ ఒకటి - ఎంచుకుని - దాన్ని క్రికెట్‌లో (అప్పుడు మాకు అది తెలియదు) స్టంప్స్ మీదికి విసిరినట్లు విసిరేవాళ్లం.. తగిలిందా? ‘టాంగ్’మని చప్పుడు వచ్చేది - ఓహోయ్! మని గెంతులు - ఓ రోజు - మా తమ్ముడు - ‘అన్నియా.. అన్నియా’ (వాడి పిలుపు అప్పట్లో అదే) రామచిలకని పట్టుకుందాం అన్నాడు - అక్కడ మేకలు మేస్తూ కనపడేవి - చిలకలు - ఏవేవో రంగురంగుల పిట్టలు ఆ నీరెండలో వ్రాలేవి - వాడో నాగుల గావంచా తెచ్చాడు - అది ఓ చిలక మీద పడెయ్యాలి - ఇంకా ఆ పిట్ట ఎక్కడికీ ఎగరలేదు - దాన్ని ఒడిసి పట్టుకోవాలి - ‘ఎందుకురా? మనం బ్రాహ్మలం. శాకాహారులం. పిట్టల్ని పట్టుకోకూడదు’ - మామ్మ కోప్పడుతుందీ’.
... ఓ పక్క చిలక పిట్టల వెంట పడుతూనే వాదులాట జారీ.
-వాడేమో మామయ్యా గారి వాచ్‌మ్యాన్ వాళ్ల - కూతురికి - ‘సరస్పతి మీద వొట్టు పెట్టి మరీ చిలకని తెచ్చి ఇస్తానని’ మాట ఇచ్చాడుట - అల్లికాయలు (గోలీలు) అడ్వాన్సుగా ఇచ్చిందిట! - ప్రొదెక్కింది - చెమటలు పోశాయి.. ఎండ చుర్రుమన్నది. గొంతెండిపోయింది. తుర్రుతుర్రుమని ఎగిరిపోయే పిట్టలేగానీ.. అమ్మో! మామయ్య చంపేస్తాడు - తిరిగి పోదాం రా అన్నాను- అత్తయ్యకి రేపు ఏదో ఒకటి చెపుదాం లే - టైము తెలియదుగా - పోదాం - ‘తొమ్మిదయ్యింది గావల’ అన్నాడు మేకలబ్బాయి మేఘాల అంచుల్ని తేరిపారి చూసి. మేమే చిలకల వేట ఆపి, త్వరగా ‘రైట్ అబౌట్ టరన్..’ కొట్టాము.
మేము ఏమయిపోయాయో తెలియక - తెలుసుకొనే మార్గం లేక మా సత్యం అత్త రోజంతా రోదించిందిట.. మర్నాడు మమ్మల్ని చూస్తూనే - ఓ పక్క అక్కుళ్లు బుక్కుళ్లు ఏడుస్తూనే - చిటుకు చితుకూ లెంపలు వాయించేసింది. వదినకి నా ప్రాణాలు ఇస్తే మాత్రం వూరుకుంటుందా? ఒరే, కృష్ణా! తమ్ముడికి బుద్ధిలేదు - సరే, కాని నీ బుద్ధి బూరెలు తిన్నదా? మళ్లీ నోట్లో కొంగు క్రుక్కుకుంది.
చెప్పింది.. ‘నీ చిన్నప్పుడు - మన విజేనగరం ఇంట్లో అటక పడిపోయిందిరా.. దాని క్రింద నువ్వు ఉండిపోయావూ.. గగ్గోలు పెట్టేస్తున్నాం మేం.. అంతలో కీచు గొంతు - అటక క్రింద నుంచీ.. నీర్సంగా ‘సత్యం తీసీ.. సత్యం నన్ను తీసీ..’ అని అరిచావురా నువ్వు - అమ్మా అనలేదు. మ్మామ్మా అని అనలేదు అంటూ నన్ను హత్తుకుని కన్నీళ్లు ఒత్తుకుంది. మరో గ్లాసు పాలు ఇచ్చింది మాకు.. మా నాన్నగారి ఆఖరి చెల్లి సత్యవతి.. గొప్ప గాయని - మాటకారి ‘పుష్పవల్లి లాగా వున్నావే’ అనే వాళ్లు అత్తని - వాళ్లు మాకు మామ వరస మేనమామలు ఇలా వగైరా చాలామంది.. (ఎవరా పుష్పవల్లి?) అటు వేపు వాళ్లల్లో చౌకబారు హాస్యాలెక్కువ. మా ఊళ్లో మాకు అట్లా ఇష్టం ఉండదు.. మా నాయనమ్మగారి పుట్టిల్లు శ్రీకాకుళం - కాశీ సోమయాజుల వారు - కాస్సాల వారు అంటేనే తెలుస్తుంది. వాళ్లంతా రూటు బస్సు ఆపరేటర్లు.. మా మామ్మ మేనల్లుళ్లు కదా. ముతక హాస్యానికి పెట్టింది పేరు.. దొంగ - కక్కకట్టా అని తిట్టేది మా అత్త సాంబం మామని.. నవ్వేసేది అంతలో. నిజానికి కమ్యూనికేషన్స్, చదువులు, సదుపాయాలూ ఇవేమీ లేని ఆ రోజులలో అటువేపు ఉత్తరాంధ్ర కల్చర్‌ని దాని తిరుగుబాటు తత్వాన్ని పెద్దయ్యాక మాత్రమే వర్తమాన పరిస్థితులతో బేరీజు వేసుకొని అర్థం చేసుకున్నాను.. మా మేనత్త మీద (ఆమె జీవితం ఒక సాగా) నవల రాద్దామని - పెద్దయ్యాక అనిపించింది. వాళ్లత్త వారి ఊరు పాలకొండ..ట. కాని, అటువంటి జీవన పోరాటాన్ని చిత్రీకరించాలి అంటే ఒక్క శరత్‌చంద్ర ఛటర్జీ ది గ్రేట్ అనగా శరత్‌బాబుకే సాధ్యం అవుతుంది అనిపించింది.
నా ‘తొలి మలుపు’ పయనీర్ నవల అన్నారంతా.. ఒక రకంగా నిజాల్ని రికార్డు చేసిన రన్నింగ్ కామెంటరీయే. అది ఒక తిరుగుబాటు కూడా. అందుకే ‘తొలి మలుపు’ వీరాజీగా నన్ను యాభై సంవత్సరాల తరువాత కూడా అదే మక్కువతో సాహితీలోకం ఆదరిస్తున్నప్పటికీ అది నాకెలా సాధ్యం అయ్యిందో నాకు తెలుసు. నా ఎర్రటి నెత్తురు పోసుకు పూచిన ఎర్రముండ్ల గులాబీ అది. తెలుసు. కాని.. విడీవిడని చిక్కులు నవల నేను రాయడం మాత్రం జన్మజన్మల సుకృతమే అనిపిస్తుంది.. నాకు. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కాని గుండెల్లో రక్తం కన్నీరుగా మారి కరిగిపోతూనే ఉంటుంది - కన్నీరుగా మారి కారిపోతూనే ఉంటుంది ఇప్పటికి అది చదువుతూ వుంటే. నేను పాతిక నవలలు రాశాను కాని జర్నలిస్టుగా మారిపోయాక రాసినవి చాలా తక్కువ. సుఖం కోసం ప్రేమకు పగ్గాలు మొదలయినవి లేకపోలేదు.

(ఇంకా బోలెడుంది)

చిత్రం.. ఆధునిక తెలుగు కథ 1910లో పురుడు పోసుకున్నదీ కుర్చీలోనే. విజై నగరం గురజాడ వారి ఇంట వారు ఈ కుర్చీలో కూర్చొనే ‘దిద్దుబాటు’ వేశారు. 2010 కథా శతజయంతి నాటిది ఈ చిత్రం - ప్రక్కన సీనియర్లు, ఆత్మీయులు మంజుశ్రీ, పొరంకి - అప్పాజీ కుర్చీ సమక్షంలో ప్రణమిల్లిన వేళ..

వీరాజీ.. 92900 99512 veeraji.columnist@gmail.com