తెలంగాణ

వాహ్.. స్నేక్ అరెస్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన తాడ్‌దాన్‌పల్లి రైతు
భూ ప్రకంపనలతో పాములు, ఎలుకలు పరార్

సంగారెడ్డి, మార్చి 12: వ్యవసాయ పొలాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తరుచుగా పాములు, ఇతర క్రిమికీటకాలు, పందికొక్కులు, ఎలుకలతో భయాందోళనతో సతమతమవుతున్నారు. వారికి ఉపశమనం కల్పించే స్నేక్ అరెస్టర్ పరికరం అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో లభించే ఈ పరికరాన్ని భూమిలో పాతిపెడితే పరికరం నుంచి వెలువడే ప్రకంపనలకు విషాన్ని చిమ్మే పాములతో పాటు అన్ని రకాల క్రిమికీటకాలు క్షణాల్లో పరార్ అవుతున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం పోలీసులు తరుచుగా పాములు సంచారంతో భయాందోళనకు గురయ్యేవారు. ఒక సందర్భంగా తన కుర్చీలో కూర్చుండి విధులు నిర్వహిస్తున్న కొల్చారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గదిలోకి ఓ పాము వచ్చి బల్ల కింద కూర్చోవడంతో గజగజ వణికిన ఎస్‌ఐ రెండు కాళ్లు పైకి పెట్టుకుని కుర్చీలో కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొన్న విషయాన్ని పోలీసు సిబ్బంది చర్చించుకున్నారు. పోలీసులు చర్చించుకుంటుండగా విషయం చెవిన పడటంతో పాములను, ఎలుకలను పారద్రోలడానికి ఓ పరికరాన్ని కనుగొనాలనే ఆలోచన పుల్కల్ మండలం తాడ్‌దాన్‌పల్లికి చెందిన రైతు రాంచంద్రయ్యకు తట్టింది. స్నేక్ అరెస్టర్ అన్న పేరుతో కొద్ది రోజుల్లోనే ఆధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాడు. సౌరశక్తి ద్వారా 24 గంటల పాటు పనిచేసే ఈ స్నేక్ అరెస్టును భూమిలో ఆరు ఫీట్ల లోతులో అమర్చాలి. ఈ పరికరాన్ని ఉత్పత్తి చేయడానికి సరాసరి 12 వేల రూపాయల ఖర్చు అవుతుందని రాంచంద్రయ్య పేర్కొన్నారు. రూ.2 వేల విలువైన సౌర శక్తి సంగ్రాహక పలక, రూ.2700 విలువైన 18 ఎహెచ్ బ్యాటరీ, పరికరాన్ని అమర్చడానికి అవసరమైన రూ.4 వేల ఖర్చుతో బాక్సు, టైమర్‌తో పని చేసే విధంగా పరికరాన్ని రూపొందించాడు. భూ ప్రకంపనలు వెలువడే విధంగా ఎనిమిది వరుసలుగా కాలువలుగా తవ్వాల్సి ఉంటుంది. ప్రతి మూడు సెకన్లకు ఒకసారి భూమిలో శబ్ధం చేస్తూ ప్రకంపనలు వెలువడుతుంటాయి. ప్రకంపనల చప్పుడు కనీసం బయటకు వినిపించకపోవడమే కాకుండా నేలపై కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు. నిరంతరం పాములు, ఎలుకలతో భయపడే తమకు ఇప్పుడు హాయిగా ఉందని, నిర్భయంగా పోలీస్ స్టేషన్‌లో పడుకుంటున్నామని అక్కడ విధులు నిర్వహిస్తున్న తుకారాం అనే కానిస్టేబుల్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. స్నేక్ అరెస్టర్ సృష్టికర్త రాంచంద్రయ్య మాట్లాడుతూ ప్రధానంగా పంట పొలాల్లో ఈ యంత్రాన్ని అమర్చుకుంటే రైతులు క్రిమికీటకాలతో ప్రమాదాలకు గురికాకుండా ఉంటారని, పంటలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు సైతం దరిదాపుల్లోకి రావన్నారు. కూరగాయలు సాగు చేసే రైతులకు ఈ పరికరం ఇతోధిక సేవలను అందిస్తుందని, ప్రధానంగా తీగల ద్వారా ఉత్పత్తి అయ్యే కాకర, చిక్కుడు, బీర, బిర్నీస్, సొరకాయ లాంటి తీగల్లో ప్రాణాంతకమైన పాములు ఆశ్రయం పొందే అవకాశం ఉంటుందని, వాటిని పారద్రోలడానికి స్నేక్ అరెస్టర్ చక్కగా దోహదపడుతుందన్నారు. వర్షం, ఎండ తీవ్రత ఉన్నా ఎలాంటి నష్టం ఉండదని, ప్రతి మూడు సెకన్లకు ఒకసారి 24 గంటల పాటు తనంతట తానుగా పనిచేస్తుందని, ఆపరేటింగ్ అవసరం లేదన్నారు.
** స్నేక్ అరెస్టర్‌ను సిద్ధం చేసిన రాంచంద్రయ్య**