రాష్ట్రీయం

వందశాతం ఇంకుడు గుంతలతో ఇబ్రహీంపూర్ రికార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 23: స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని నిరూపించడానికి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలు నడుంకట్టి సంపూర్ణ విజయం సాధించారు. ఈ గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇల్లులేదు..నిర్మించుకున్న మరుగుదొడ్లను చిన్నపిల్లలతో సహా పండు వృద్ధుల వరకు వంద శాతం వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడ కూడా బహిరంగ మలవిసర్జన కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు. తెలిసీతెలియక ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేస్తే వారికి 500 రూపాయల జరిమానా సైతం విధించాలని గ్రామ కమిటీ తీర్మానం చేయడంతో పాటు నిఘాను సైతం ఏర్పాటు చేసారు. ఇప్పటివరకు ఎవరు కూడా ఈ తీర్మానాన్ని ఉల్లంఘించకపోవడం గ్రామ స్థుల చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు. అభివృద్ధికి నోచుకోని బుడగజంగాల వీధులు, దళిత వాడ అనే తేడా లేకుండా వీధులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తాయి. వర్షం నీరు అటుంచితే ఇళ్లలో ఉపయోగించిన నీరు చుక్క కూడా బయటకు రాదంటే నమ్మశక్యంకాని విషయం. ప్రతి ఇంటికీ ఇంకుడుగుంతను సాంకేతికతను ఉపయోగించి ఏర్పాటు చేసారు. ఇళ్లలోని నీటితోపాటు చేతిపంపులు, మంచినీటి సరఫరా చేసే ట్యాంకులు, పబ్లిక్ నల్లాల వద్ద కూడా నీరు వృథాపోకుండా ఇంకుడు గుంతలను తవ్వించారు. ఇంటిలో స్థలం అనుకూలంగా ఈ గుంతలను తవ్వించారు. కనిష్టంగా 6 అడుగుల లోతు, నాలుగున్నర అడుగుల వెడల్పుతో మొదటగా గుంతను తవ్వించారు. అడుగుభాగంలో దొడ్డు కంకర పోసిన అనంతరం రెండున్నర ఫీట్ల ఎత్తుకలిగిన సిమెంట్ తొట్టెని తీసుకుని దానికి మధ్య భాగంలో మూడువైపుల రంధ్రాలు చేసి ఉంచా రు. అనంతరం సన్నకంకరను పోసి పూడ్చారు. మూడు నాలుగేళ్లకు ఒకసారి ఈ గుంతను తవ్వి తొట్టెలో పేరుకుపోయే మట్టి, ఇతర చెత్తచెదారాన్ని తొలగించే వెసులుబాటు సైతం కల్పించారు. ఒక్కో గుంతకు కనిష్టంగా 7 వేల రూపాయలు ఖర్చు అయినట్లు సర్పంచ్ లక్ష్మి పేర్కొన్నారు. స్వంత డబ్బులు వెచ్చించి అందరి ఇళ్లకు ఇంకుడు గుంతలను తవ్వించారు. గ్రామంలో 255 కుటుంబాలు ఉండ గా వంద శాతం గుంతలను తవ్వించారు. ప్రభుత్వ ఆస్తుల వద్ద మరో 7 గుంతలను తవ్వగా మొత్తం 261 గుంతలను పూర్తి చేసారు. ఇక గ్రామంలో గతంలో నిర్మించిన మురు గు కాలువల్లోకి ఇళ్లలోని నీరు వెళ్లకపోవడంతో అవి కాస్త ఎండిపోయాయి. పైలెట్ ప్రాజెక్టు కింద ఇంకుడు గుంతలను నిర్మించినట్లు వివరించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రోత్సాహం వల్లనే తమ గ్రామం రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేసారు. సిఎం పిలుపు మేరకు నీడనిచ్చే మొక్క ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టారు. రెండు మూడు సంవత్సరాల్లో గ్రామం లో ఎటుచూసినా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించడం తథ్యం. భవిషత్‌లో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతుందని, అపరిశుభ్రత లేనికారణంగా గ్రా మస్థులంతా ఆరోగ్యంతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసా రు. జట్టుకట్టి పట్టుపడితే లక్ష్యంవైపు వెళ్తామని సిఎం కెసిఆర్ చేసే సూచనలను అందిపుచ్చుకున్న హరీష్‌రావు తన నియోజకవర్గం మొత్తాన్ని బహిరంగ మలవిసర్జన లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఒక్కో గ్రామా న్ని ఎంపిక చేసుకుంటూ విజయం సాధిస్తున్నారు.