అంతర్జాతీయం

కైరో, ఫిబ్రవరి 2: ఈజిప్టులోని పోర్ట్ సరుూద్ నగరంలో బుధవారం రాత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ మృత్యుక్రీడను మరిపించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ఘర్షణలు తొక్కిసలాటలో 74 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అల్- మస్రీ, అల్-అహ్లీ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం రెండు క్లబ్‌ల అభిమానులు పరస్పరం కత్తులతో దాడులు జరపుకొన్నారు. ఒకరిపై ఒకరు సీసాలు, రాళ్లు, కర్రలు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో తొక్కిసలాట కూడా జరిగింది. తొక్కిసలాటలోకొందరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించడంతో పాటుగా అన్ని ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేసారు. దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన సంఘటన అని ఈజిప్టు హోం మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, ఈ మరణాలకు ఈజిప్టు మిలటరీయే కారణమని ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరోపించగా, అభిమానులే పోలీసులను రెచ్చగొట్టారని హోం మంత్రి ప్రత్యారోపణ చేసారు.
ఈ మ్యాచ్‌లో అల్‌మస్రీ జట్టు 3-1 గోలుల తేడాతో గెలుపొందిన తర్వాత ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. కాగా, మ్యాచ్ ఆద్యంతం ఉద్రిక్తత కొనసాగిందని, స్థానిక క్లబ్‌ను అవమానించే రీతిలో అల్ అహ్లీ క్లబ్ అభిమాని ఒకరు బ్యానర్ ప్రదర్శించడం ఉద్రిక్తతకు కారణమని ప్రత్యక్ష సాక్షులనుటంకిస్తూ మీడియా తెలిపింది. మ్యాచ్ ముగియగానే అల్ మస్రీ క్లబ్ అభిమానులు మైదానంలోకి దూసుకువెళ్లి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు, అభిమానులపై దాడి చేసారని వారు చెప్పారు. (్చత్రం) ఫుట్‌బాల్ మైదానంలో హింస తలెత్తి చెలఠేగిన మంటలు
Add new comment