సబ్ ఫీచర్

సాఫ్ట్‌వేర్ రంగంలో మహిళలదే పైచేయి...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆకాశంలో సగం మేము- అవకాశాలలో కూడా సగం’’ కావాలంటూ ఉద్యమిస్తూన్న మహిళలకు బాసటగా నిలవడానికి మేము సైతం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఐటి కంపెనీలలో మహిళా ఉద్యోగులు 35 శాతం మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, పీపాల్స్, డెల్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వినూత్న రీతిలో పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి అయిన వారిని ఎంపిక చేసుకోవడంకన్నా, ప్రాథమిక విద్య స్థాయి నుంచే విద్యార్థినులకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించి, భవిష్యత్‌లో వారిని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా రూపొందించేందుకు ఈ కంపెనీలు తమ కృషి చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్కార్చ్ పేరిట, డెల్ కంపెనీ గ్రీక్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తూ టాలంట్ సెర్చ్‌ని ప్రారంభించాయి. యువకులు కన్నా యువతులు ఎక్కువ క్రమశిక్షణ, సమయపాలన పాటించడంతోపాటు కష్టపడి వినూత్నంగా పనిచేస్తారని, అందువల్లనే మహిళా ఉద్యోగుల ఎంపికకే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని సాఫ్ట్‌వేర్ ప్రముఖుడొకరు పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ ఇండియా డిజి గర్ల్స్ కార్యక్రమంలో భాగంగా 12-14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలికలను ఎంపిక చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా వారికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ పట్ల సరైన అవగాహన కల్పిస్తున్నారు. ఆయా విభాగాలలో ఉన్న ఉపాధి అవకాశాలు గురించి వివరించి, వారిని చైతన్యవంతం చేస్తున్నారు.
పీపాల్స్ సంస్థ స్కార్చ్ కార్యక్రమంలో భాగంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల్లో 30 మంది బాలికలను ఎంపిక చేసి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది కూడా. ఆట, పాటల ద్వారా సాఫ్ట్‌వేర్ రంగాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం పీపాల్స్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులలో 40 శాతం మహిళలు ఉండటం గమనార్హం. డెల్ కంపెనీ నిర్వహిస్తున్న ‘గ్రీక్స్’ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థినులను ఎంపిక చేస్తున్నారు. వారికోసం వర్క్‌షాపులు, యాక్టివిటీస్, ప్రెజెంటేషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలికలు ఐటి, ఇంజనీరింగ్ కోర్సుల పట్ల ఆకర్షితులను చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇదే పంథాలో నడవడానికి మరికొన్ని సాఫ్ట్‌వర్ కంపెనీలు కూడా సిద్ధం అవుతున్నాయి. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో మహిళలదే పైచెయ్యి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

-పి.హైమావతి