బిజినెస్

సోలార్ వ్యవసాయ పంపుసెట్లకు విశేష ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు జిల్లాల్లో 1,900 సోలార్ పంపుసెట్లు

విశాఖపట్నం, మార్చి 11: విద్యుత్ ఆదా చేసే, పర్యావరణాన్ని పరిరక్షించే సోలార్ పంపుసెట్లకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసిఎల్) పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 3,100 సోలార్ పంపుసెట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికే 1,900 మంది రైతులు సోలార్ పంపుసెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, వీటికి అవసరమైన సొమ్ము చెల్లించడం జరిగింది. వీటన్నింటినీ పరిశీలించిన సంస్థ యాజమాన్యం ఇంతవరకు 1,400 సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయగలిగింది.
ఐదు జిల్లాల పరిధిలో వీటిని ఏర్పాటుచేశారు. మిగిలిన 500 పంపుసెట్లను సంబంధిత రైతులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఆదా, కాలుష్య నివారణ సాధ్యపడుతున్నందున ఇక నుంచి ఎక్కువ సంఖ్యలో సోలార్ పంపుసెట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో ఈపిడిసిఎల్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పిడిసిఎల్) పరిధిలో పది వేల సోలార్ పంపుసెట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రైతులు ముందుకొస్తే సకాలంలో సోలార్ పంపుసెట్లు మంజూరు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అలాగే వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐదు జిల్లాలకు సంబంధించి సోలార్ పంపుసెట్ల ఏర్పాటులో లక్ష్యాలు అధిగమించాలని ఈపిడిసిఎల్ అధికారులు నిర్ణయించారు.
5 హెచ్‌పి పంపుసెట్లకే డిమాండ్
మరోవైపు ఎక్కువగా 5 హార్స్ పవర్ (హెచ్‌పి) సోలార్ పంపుసెట్లను మాత్రమే రైతులు కోరుకుంటున్నారు. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు ముందుకొస్తున్నారు. దీంతో వీటికి ఇటీవల డిమాండ్ పెరిగింది. 5 హెచ్‌పి సోలార్ పంపుసెట్ కోరుకునే రైతు తన వంతుగా రూ. 55 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే 3 హెచ్‌పి పంపుసెట్‌కు అయితే రూ. 40 వేలు చెల్లించాలి. అయితే దీని వల్ల అనుకున్నంత సామర్థ్యం ఉండదు. అందువల్ల అధిక శాతం రైతులు 5 హెచ్‌పి సోలార్ పంపుసెట్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా పంపుసెట్లపై రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
బావులకు సోలార్ మోటార్లు
ఇక నుంచి వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే బావులకు సోలార్ పంపుసెట్లు అమర్చుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అనుమతులిస్తున్నాయి. బావులకు వీటిని సులభంగా అమర్చుకునే సౌలభ్యం లభిస్తుంది. 5 హెచ్‌పి సోలార్ పంపుసెట్లు కోరుకునే రైతులు నేరుగా అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ పంపుసెట్ల కోసం గోదావరి జిల్లాల రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఈపీడీసిఎల్ కమర్షియల్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ బి రమేష్ ప్రసాద్ తెలిపారు.