బిజినెస్

రాష్ట్ర మార్కెట్‌లో సోలార్ ట్రాకింగ్ యూనిట్లు

  • 23/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 22: సౌర శక్తి ద్వారా విద్యుత్

ఉత్పత్తి చేసేందుకు స్మార్ట్ ట్రాక్ సోలార్ సిస్టమ్స్ చేసిన

ప్రయత్నం ఫలించడం వల్ల విస్తత్రంగా యూనిట్లను

మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు

తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం వద్ద ఏర్పాటు చేసిన

హారిజాంటల్ ట్రాకింగ్ సిస్టమ్ విజయవంతంగా పని

చేస్తోందని అన్నారు. సాధారణ విద్యుత్ కన్నా

సౌరవిద్యుత్ చాలా చౌకగా ఉన్నందున రాష్ట్రంలో సోలాల్

ట్రాకింగ్ సిస్టమ్స్‌ను పెద్ద ఎత్తున రాష్ట్ర మార్కెట్‌లో

ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ కంపెనీ సిఇఓ భగవాన్‌రెడ్డి,

మేనేజింగ్ డైరక్టర్ కె.రఘురామ్ తెలిపారు. బుధవారం

నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో

వారు మాట్లాడుతూ 2022 నాటికి దేశంలో సౌరశక్తి

ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి

చేయాలనే లక్ష్యాన్ని జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్

సోలార్ మిషన్ నిర్ధేశించిందని వారు గుర్తు చేశారు.

దీనిలో భాగంగా సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు

అనువుగా అధిక సంఖ్యలో సోలార్ ట్రాకింగ్ సిస్టమ్స్‌ను

తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. చాలా

తక్కువ ధరకే ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ అల్గోరిథమ్స్, కంట్రోల్

సిస్టమ్స్, హార్ట్‌వేర్‌తో డిజైన్స్, ఎలక్ట్రోమెకానికల్

డివైసెస్‌లను తయారు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఎమ్మార్ ఎంజిఎఫ్‌కు ఐఎస్‌ఒ ధ్రువపత్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 22: దేశంలో ప్రీమియర్ రియల్

ఎస్టేట్ డెవలపర్స్‌లో ఒకటిగా నిలిచిన ఎమ్మార్

ఎంజిఎఫ్‌కు వినియోగదారుల సేవలకు సంబంధించి

అత్యంత ప్రముఖమైన 9001:2008, ఐఎస్‌ఓ

10002:2004 ధృవపత్రం లభించినట్లు ఆ సంస్ధ

చీఫ్ సర్వీస్ ఆఫీసర్ అజయ్ నంబియార్ ఒక ప్రకటనలో

తెలిపారు. దేశంలో ప్రముఖ నగరాల్లో చేపట్టిన

ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యతా

ప్రమాణాలు, వినియోగదారులను సంతృప్తిపరిచే

పద్ధతుల్లో ఎంజిఎఫ్‌కు గుర్తింపు ఉందన్నారు.
మరో ఆరు పట్టణాలకు ఎంటిఎస్ హైస్పీడ్ డాటా ఎంబ్లేజ్

సేవలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎంటిఎస్ బ్రాండ్ పేరుతో దేశ

వ్యాప్తంగా టెలికామ్ సేవలను అందిస్తూ 15 మిలియన్

వైర్‌లెస్ వినియోగదారులను కలిగి ఉన్న తమ సంస్ధ

రాష్ట్రంలో ఆరు పట్టణాల్లోహై స్పీడ్ డాటా ఎంబ్లేస్ సేవలను

విస్తరించినట్లు ఆ సంస్ధ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్

సురేష్‌కుమార్ తెలిపారు. మహబూబ్‌నగర్, నల్లగొండ,

భీమవరం, చిత్తూరు, మెదక్, సంగారెడ్డిలో ఈ సేవలను

అందిస్తున్నారు. దీంతో ఆంధ్రాలో ఎంబ్లేజ్ సేవలను

అందుబాటులోకి వచ్చిన పట్టణాల సంఖ్య 21కు

చేరుకుందన్నారు. ఈ సేవల ద్వారా అనేక ఆఫర్లు

అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎంటిఎస్ ద్వారా

నేరుగా టీవీ ప్రసారాలన వీక్షించే అవకాశం, వీడియో

ఆన్ డిమాండ్ సదుపాయం ఉందన్నారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading