మెయిన్ ఫీచర్

పోలీసులు వౌనంగా ఉంటారనుకోను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపుడు సోని సొరి పోరాట బాణం పోలీసులపైనే కాకుండా ఐజి కల్లూరి శివరామ్‌పైనే ఎక్కుపెట్టారని చెప్పవచ్చు. తమ గ్రామంలోని ఇళ్లన్నీ తగులబెట్టించిన శివరామ్‌పై ఇంతవరకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ పల్లెసీమలో ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి సైనిక బలగాలను నియమించాల్సిన అవసరమేమిటని ఆమె ఆక్రోసిస్తున్నారు.
============
డవి తల్లి ఒడిలో పెరిగే ఆదివాసీ బిడ్డల్లో అమాయకత్వం తప్ప వేరేదేమి కనిపించదు. కొండకోనల్లో తెనెపట్టు పట్టే వారికి ఈనాటికి సరైన భాష లేదు. వచ్చిరానీ యాసతో వారి భావాలను వ్యక్తంచేస్తుంటారు. వారి జీవన విధానం ఈనాటికీ ఆది మానవుడి కాలం వద్దే ఆగిపోయిందా అనిపిస్తోంది. అలాంటి అమాయకపు గిరిజన బిడ్డల గూడాల్లో వినిపించే పోలీసుల కర్కశ బూట్ల సవ్వడి వారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంటుంది. నక్సలైట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వారిపై పోలీసులు చేసే అకృత్యాలు అన్నీఇన్నీ కావు. నక్సలైట్ ఉద్యమానికి నెలవైన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ ప్రాంతం పోలీసులకు, నక్సలైట్ల మధ్య నిరంతరం కాల్పులు జరిగే యుద్ధ్భూమి. ఇక్కడకు సమీపంలోని బస్తర్ గూడెం గుడిసెలు పోలీసుల చేతుల్లో ఎన్నిసార్లు తగులబడ్డాయో లెక్కలేదు. ఎంతోమంది గిరిజనులు వారి అకృత్యాలకు ప్రాణాలొదిరారు. తప్పుడు కేసులకు కొదవేలేదు.
ప్రకృతి సోయగాల మధ్య అలరారే ఆ ప్రాంతంపై కార్పోరేట్ సంస్థల కన్ను పడటమే దీనికి ప్రధాన కారణం. అమాయక ఆదివాసీల భూములను లాక్కొని కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కర్కశత్వంతో వ్యవహరించే పోలీసులు వారికి తోడయ్యారు. దీంతో వారి అకృత్యాలకు బలైపోతున్న ఆ అడవిబిడ్డల కోసం ఓ పోరాటాల తల్లి ముందుకు వచ్చింది. ముఖమంతా కాలిపోయోలా యాసిడ్ పోసినా.. కట్టుకున్న భర్త కడతేరినా.. కన్నతండ్రిని కోల్పోయినా.. పోలీసుల అకృత్యాలపై అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఆమే సోని సొరి. ఇటీవల దుండగులు జరిపిన యాసిడ్ దాడిలో చావు అంచులదాక వెళ్లి 13 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మళ్లీ గిరిజనుల సంరక్షణ కోసం కొంగు బిగించింది.

సోని సొరి అందరిలాగానే పెరిగిన అడవి బిడ్డ. కాని ఆమెకు నక్సలైట్ అనే ముద్రను పోలీసులు వేశారు. ‘‘నేనే నక్సలైట్‌నైతే మరి నా తండ్రిని నక్సలైట్లు ఎందుకు చంపుతారు? కన్నతండ్రిని రక్షించుకునేదాన్ని కదా!’’ అని ఎదురు ప్రశ్నిస్తోంది. కొద్దోగొప్ప ఆర్థికంగా స్థిరపడిన కుటుంబానికి చెందిన సోని సొరి స్కూలు టీచర్‌గా పనిచేసేది. తండ్రి బస్తర్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. భూస్వామి. ఈమె కుటుంబానికి చెందిన వారంతా కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు కలిగిన వారే. ప్రజాప్రతినిధులుగా చేసినవారే. 2014 ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి బిజెపి చేతిలో ఓడిపోయారు.ఇపుడు సోని సొరి పోరాట బాణం పోలీసులపైనే కాకుండా ఐజి కల్లూరి శివరామ్‌పైనే ఎక్కుపెట్టారని చెప్పవచ్చు. తమ గ్రామంలోని ఇళ్లన్నీ తగులబెట్టించిన శివరామ్‌పై ఇంతవరకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ పల్లెసీమలో ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి సైనిక బలగాలను నియమించాల్సిన అవసరమేమిటని ఆమె ఆక్రోశిస్తున్నారు. సోని దంపతులను నక్సలైట్ అనే ముద్రవేసి అరెస్టు చేయటమేకాకుండా భర్తను పోలీసులు విపరీతంగా హింసించటం వల్ల ఆయనకు పక్షవాతం వచ్చి నెలరోజుల మృత్యువాత పడ్డాడు. జైలులో పోలీసులు ఆమె గర్భాశయంలోకి రాళ్లు జొప్పించి హింసించారు. ఆమె నడవలేని పరిస్థితికి చేరుకున్నా పోలీసులు కనికరించలేదు. చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవటంతో బెయిల్ మంజూరైంది. ఆమె సన్నిహితులు ఆమెను కోల్‌కతా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. గర్భాశయంలోని రాళ్లను తొలగించటంతో సజీవంగా బయటపడ్డారు. ఫిబ్రవరిలో హిద్మా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు పిల్లలున్న ఒ అమాయకపు ఆదివాసీ తండ్రి పోలీసుల చేతిలో హతమయ్యాడు. మృతుడి ఆధార్‌కార్డు, బ్యాంక్ ఎకౌంట్ పరిశీలించినా అతను నక్సలైట్ కాదనే వాస్తవాలు వెల్లడిస్తాయని, కాని నక్సలైట్ అనే ముద్రవేసి చంపేసి ఇపుడు ఆ కుటుంబాన్ని దిక్కులేకుండా చేశారని, దీనిపై తాను పోరాటం చేస్తే తనపై, తన భర్తపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసల పాల్జేశారని సోని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు పోలీసుల అకృత్యాలకు భర్తను సైతం పోగోట్టుకోవటమే కాకుండా తాను కోర్టులు చుట్టూ, తన ముగ్గురు బిడ్డలు ఒంటరిగా ఏ క్షణాన ఏవౌతుందోనని బిక్కుబిక్కుమంటూ గూడెంలో గడుపుతున్నారని విలపించింది. ఈ గాయాలు, కన్నీళ్లు తన పోరాటాన్ని ఆపలేవని, పోలీసుల అకృత్యాలను ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి ఆదివాసీలకు న్యాయం చేకూరుస్తాననే నమ్మకం తనకు ఉందని అంటారు. అందరికీ పక్షుల కిలకిలరావాలతో తెల్లవారితే తమ గూడెంలో పోలీసులు బూట్ల చప్పుడుతో తెల్లవారుతుందని, ఎన్నో బెదిరింపులు, దాడులు నిత్యకృత్యమయ్యాయని అంటారు. బెదిరింపుల పరాకాష్టే యాసిడ్ దాడి. ఈ గాయాలు, మంటలు తన బాధ్యతను గుర్తుచేస్తుంటాయని చెప్పటం ఆమె పోరాటానికి ప్రతీక అనే పదానికి నిదర్శనంగా చెప్పవచ్చు. గూడెం మొత్తం భయానిక పరిస్థితుల్లో మగ్గుతున్న వేళ మీ పిల్లలు దీనిని ఎలా తట్టుకుంటున్నారని అడిగితే, తాను రెండున్నరేళ్లపాటు జైలులోనే గడపాల్సి వచ్చింది. ఈ ఒంటిరితనమే వారిని రాటుదేల్చిందని అనుకుంటున్నాను. అయినప్పటికీ పసివయసులో ఉన్నవారు అంతకుమించి ఏమి చేయగలరు అని సోని ప్రశ్నిస్తున్నారు. ఆమె పలుకులు చత్తీస్‌గఢ్ ఆదివాసీ చిన్నారుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
*