జాతీయ వార్తలు

మారిన కాంగ్రెస్ వ్యూహం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని మార్చుకున్నట్టు కనపడుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించకూడదని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించిందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ తెలిపింది. అందువల్ల వారిద్దరు ఈ కేసు విచారణ కోసం ఢిల్లీ హైకోర్టు ఎదుట హాజరవుతారని పేర్కొంది. డిసెంబర్ 19న జరిగే ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఇతరులను మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సీనియర్ న్యాయవాదులు డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, హరీన్ రావల్, రమేశ్ గుప్తా, సోనియా, రాహుల్, ఇతర నిందితుల తరపున మంగళవారం ఒక్క రోజు వారు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ‘మేము కోర్టుకు హాజరుకావాలనే అనుకుంటున్నాము’ అని సింఘ్వీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లొలీన్‌కు చెప్పారు. ‘డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామికి వెసులుబాటుగా ఉండేలా మీ ఇష్టమొచ్చిన ఒక తేదీని చెప్పండి’ అని సింఘ్వీ మేజిస్ట్రేట్‌ను కోరారు. సోనియా, రాహుల్‌తోపాటు మరో అయిదుగురు- సుమన్ దూబే, మోతీలాల్ వోహ్రా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్- బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు ట్రయల్ కోర్టు తమకు సమన్లు పంపించడాన్ని సవాలు చేసిన విషయం తెలిసిందే. మూతపడిన నేషనల్ హెరాల్డ్ దినపత్రికను తమ ఆధీనంలోకి తీసుకోవడంలో వారు మోసానికి, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు.

(చిత్రం) గురువారం పార్లమెంట్‌కు వస్తున్న సోనియా