జాతీయ వార్తలు

కేసులకు భయపడేది లేదు : సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : చట్టాన్ని తాము గౌరవిస్తామని, కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశ పౌరులుగా ఏం చేయాలో తాము అదే చేశామన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మంజూరు అనంతరం సోనియా, రాహుల్ శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో మాట్లాడారు. కేసులకు భయపడేది లేదని సోనియా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా... ప్రజల కోసమే తమ పోరాటం సాగుతుందని, ప్రతిపక్షంగా తమ పాత్ర తాము పోషిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ సోనియా, రాహుల్కు కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందన్నారు.