జాతీయ వార్తలు

రాజ్యాంగ పరిరక్షణకు సమాయత్తం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు * అంబేద్కర్‌ను గుర్తించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యాంగం రూపకల్పనలో భాగస్వాములు కాని వారు, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు ఇప్పుడు తామే రాజ్యాంగ పరిరక్షకులమని ప్రచారం చేసుకుంటూనే, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనివారు వ్యవహరిస్తున్న తీరుతెన్నుల మూలంగా సంక్షోభంలో చిక్కుకుంటున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటానికి ప్రతి ఒక్కరు సమాయాత్తం కావాలని ఆమె పిలుపిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్‌కు నివాళులు అర్పిస్తూ చేసిన ప్రసంగంలో ఆమె బిజెపి పేరును ప్రస్తావించకుండానే ఘాటైన విమర్శలు చేశారు. సోనియా ప్రసంగాన్ని అడ్డుకోవటానికి పాలకపక్ష సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినా సోనియా గాంధీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె చెప్పారు. రాజ్యాంగాన్ని రూపొందించటంలో అంబేద్కర్ కీలకపాత్ర వహించారు. ఆయన ఎంతో దూరదృష్టితో రూపకల్పన చేసిన రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగినప్పటికీ ప్రజలకు కొండంత అండగా నిలబడుతోందని ఆమె ప్రశంసించారు. ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం ఆశించిన ఫలితాలు ప్రజలకు లభించవనీ, ఒకవేళ రాజ్యాగం చెడ్డదైనప్పటికీ అమలు చేసేవారు సమర్థులు, మంచివారైతే సత్ఫలితాలు దక్కుతాయి’ అని రాజ్యాంగ రచన పూర్తయిన తరువాత అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఆమె చురక వేశారు.
అత్యంత సరళీకృతమైన రాజ్యాంగాన్ని రూపొందించటంలో అంబేద్కర్ విజయం సాధించారని ఆమె ప్రశంసించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం రాజ్యాంగంలో మార్పులు చేర్పులూ చేసుకుంటున్నామని ఆమె చెప్పారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారికి సామాజిక న్యాయం లభించటానికి అంబేద్కర్ చివరివరకూ సర్వశక్తులు ధారపోశారని తెలిపారు. అంబేద్కర్‌ను రాజ్యాంగ చట్టసభలో సభ్యునిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆమె గుర్తుచేశారు. అంబేద్కర్‌తోపాటు నెహ్ర, వల్లభాయి పటేల్, రాజేంద్ర ప్రసాద్, వౌలానా అబుల్ కలామ్ అజాద్ రాజ్యంగం తయారి, అమలులో ముఖ్యపాత్ర పోషించారని ఆమె చెప్పారు. వల్లభాయి పటేల్ ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించిన సలహా కమిటీకి నాయకత్వం వహించగా, నెహ్రూ ప్రాథమిక హక్కులు, ఆర్థిక విధానాలను రాజ్యాంగంలో అంతర్భాగం చేశారని ఆమె చెప్పారు.
ఆద్యంతం పటిష్ఠవంతంగా రాజ్యాంగాన్ని రూపొందించటం అంబేద్కర్‌కే సాధ్యపడిందని అప్పటి రాష్టప్రతి రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారని ఆమె గుర్తుచేశారు. రాజ్యాంగానికి మరో ప్రత్యామ్నాయం లేదని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను జవాబుదారీగా చేస్తూ, పరిపాలనను బాధ్యతాయుతం చేయటంలో రాజ్యాంగం ప్రధానపాత్ర వహిస్తోందని సోనియా గాంధీ ప్రశంసించారు.