సౌఖ్యం టీజర్‌కు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోందని, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘సౌఖ్యం’ సినిమా షూటింగ్ అంతా పూర్తయిందని తెలిపారు.
ప్రస్తుతం డిటిఎస్ ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈనెల 13న సినిమా ఆడియోను ఒంగోలులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, సినిమాను క్రిస్మస్ కానుకగా 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తన కుటుంబంతోపాటుగా సమాజ సౌఖ్యాన్ని కోరుకునే కథానాయకుని కథతో రూపొందించిన ఈ చిత్రం, అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులను ఆసక్తికరమైన కథనంతో చెబుతుందని, కథ, కథనం, మాటలు హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. 25న విడుదలకానున్న ఈ చిత్రంలో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణ్భగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృధ్వీ, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యంరాజేష్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు:శ్రీ్ధర్ సీపాన, సంగీతం:అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, కెమెరా:ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్:గౌతంరాజు, నిర్మాత: వి.ఆనందప్రసాద్, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.