రివ్యూ

ఎవరికీ దక్కని సౌఖ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సౌఖ్యం (బాగోలేదు)

తారాగణం:
గోపీచంద్, రెజీనా, షావుకారు జానకి, పోసాని తదితరులు
సంగీతం:
అనూప్ రూబెన్స్
నిర్మాత:
ఆనంద్ ప్రసాద్
దర్శకత్వం:
ఎఎస్ రవికుమార్ చౌదరి

ఈమధ్య విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నాడు హీరో గోపీచంద్. ఆయన స్టైల్లోవుండే కమర్షియల్ యాక్షన్ సినిమాలను పక్కనపెట్టి ఎంటర్‌టైన్‌మెంట్ బాటపట్టాడు. ఈ తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్ముకొని చేసిన లౌక్యం సినిమా మంచి ఫలితాన్ని రాబట్టడంతో, మరోసారి అదే శైలిలో చేసిన సినిమా సౌఖ్యం. రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎవరెవరికి సౌఖ్యం కలిగిందనేది తెలుసుకోవాలంటే..
హీరో శ్రీను (గోపీచంద్) బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అన్ని విషయాల్లో ఫ్యామిలీతో సరదాగావున్నా పెళ్లి విషయం వచ్చేసరికి తండ్రితో గొడవపడుతుంటాడు. అతని తండ్రి (ముఖేష్ రుషి) అమ్మాయిని చూశాను, తప్పకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. నేను ఈ పెళ్లి చేసుకోనని, మరే అమ్మాయినీ చేసుకోనని అనటంతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఓ రోజు శ్రీను ట్రైన్‌లో వస్తుంటాడు. ఆ సమయంలో తన ఎదురు సీట్లో కూర్చున్న శైలజ (రెజీనా)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తరువాత ఆమె ప్రేమకోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం, ఆమె ప్రేమను పొందడానికి రకరకాల ప్రయోగాలు చేయడం, తరువాత ఆమె ఓకె అనడంతో ఇద్దరి ప్రేమకథ మొదలవుతుంది. ఇలా సాగుతున్న తరుణంలో అనుకోకుండా ఒకరోజు శైలజ కిడ్నాప్ అవుతుంది. ఆమెను వెతికేపనిలో వున్న శ్రీను, పలువుర్ని కలవడం, వారితో ఛాలెంజ్‌లు గట్రా చేయడం, మధ్యమధ్యలో రౌడీలకు మస్కాకొట్టి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. అందరినీ ఎదిరించి ఎలా ఆమెను రక్షించాడనేది అసలు కథ.
రెగ్యులర్ ఫార్మెట్‌లో పక్కా కమర్షియల్ అంశాలతో అల్లుకున్న కథలో నటీనటుల గురించి, వారి ప్రతిభ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. కథలో హీరోయిజమ్ చూపిస్తూ హీరో తన భుజాలమీద వేసుకొని కథ నడిపించాడు. గోపీచంద్ లుక్‌లో కొత్తగా కనిపించినప్పటికీ, ఎప్పటిలాగే తనదైన స్టైల్లో ఫైట్లు, డాన్సులు, మధ్యమధ్యలో హీరోయిజాన్ని ప్రదర్శించే డైలాగులు చెబుతూ ఎప్పటిలానే చేశాడు. ఇక హీరోయిన్ రెజీనా గ్లామర్ రసాన్ని బాగానే పండించినప్పటికీ కాస్త కొత్తగా కామెడీని కూడా ట్రైచేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ముఖ్యంగా సినిమాలో కథను హీరోకంటే కూడా కమెడియనే్ల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కామెడీని హైలెట్ చేయాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పృధ్వీ, బ్రహ్మానందం, పోసాని, కృష్ణ్భగవాన్, సప్తగిరి, జయప్రకాష్‌రెడ్డి చేసిన కామెడీ వెగటుగా అనిపిస్తుంది. అలాగే హీరోకి పోటీగా నిలిచే విలన్ పాత్రల్లో ప్రదీప్ రావత్, దేవన్‌లు పెద్దగా మెప్పించలేకపోయారు. ఇక మిగతా పాత్రల్లో నటించిన ముఖేష్ రుషి, ప్రగతి, సురేఖావాణి, రఘుబాబు, శివాజీ రాజాలు ఎప్పటిలాగే నటించారు. సినిమాకు కీలకమైన అంశాలైన టెక్నికల్ విలువలనూ పెద్దగా చెప్పుకొనే అవసరమే రాలేదు. ముఖ్యంగా సినిమా కథ గురించి చెప్పాలంటే పక్కా మూసకథ. ఇలాంటి కథలతో వందలాది సినిమాలు ఇప్పటికే వచ్చిపోయాయి. అయినా ఇలాంటి కథలని రాయడం మన రచయితలు మాత్రం మానడంలేదు. హీరోలు ఇలాంటి సినిమాలు చేయడం ఆపడమూ లేదు. శ్రీ్ధర్ సీపాన రాసిన కథ ప్రేక్షకులకి అ‘సౌఖ్యం’ని కలిగించింది. సినిమా చూసిన తరువాత ఇలాంటి కథను ఇంకా ఎన్నిసార్లు చెబుతారా? అనే అనుమానం ప్రేక్షకుడికి కలగకమానదు. ఏమైనాఅంటే, హీరోలు, దర్శకులు అవే అడుగుతున్నారు కాబట్టి అలాగే రాస్తామని అంటారేమో. కథ చెప్పే ఫార్మాట్‌ను ఎందుకు మార్చడంలేదో, ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను తిప్పికొడుతున్నా కూడా వాటిపైనే ఆసక్తిని కనబరుస్తున్నారు ఎందుకో? ఇక కోన వెంకట్, గోపీమోహన్‌ల స్క్రీన్‌ప్లే అంటే అందరికీ నచ్చే అంశమే. కానీ ఈ సినిమాలో మాత్రం అది వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా చూస్తున్న ప్రేక్షకులకు చికాకు తెప్పించేలా సాగుతుంది కథనం. దాంతోపాటు ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోవడంతో సినిమాపై ఆసక్తి లేకుండాపోయింది.
దర్శకుడిగా రవికుమార్ ఏ కోశాన ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేయలేకపోయాడు. సినిమాకు కీలకమైన కథ, కథనం, దర్శకత్వం ఈ మూడు విషయాల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మిగతా విభాగాల్లో సినిమాకు హెల్ప్ అయింది మాత్రం సినిమాటోగ్రఫి. ప్రసాద్ మూరెళ్ళ అందించిన ఫొటోగ్రఫి ఒక్కటే సినిమాకు ఆకర్షణగా మిగిలింది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఆకట్టుకోలేవు. అంతేకాదు, రీరికార్డింగ్ కూడా దిగజారుడుగా వుంది. శ్రీ్ధర్ సీపాన రాసిన డైలాగులు పంచ్, ప్రాసలతో బాగానే ఉన్నాయి కానీ, ప్రేక్షకులకు అర్థమవడం కష్టమే. ఇలాంటి అర్థంపర్థంలేని పంచ్ డైలాగులు ఎన్ని రాసినా ఏం లాభం? ఇక వివేక్ ఆర్ట్ వర్క్ బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి సారించాల్సి ఉంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే పలుమార్లు అటుతిప్పి ఇటుతిప్పి చూపించిన హిట్ సినిమాల మూస ఫార్ములాలో అల్లిన కథే సౌఖ్యం. దానికి ఎన్ని హంగులు, ఆర్భాటాలు జోడించినా ఫలితం మాత్రం ఇలాగే వుంటుంది. మూస ఫార్ములా కథలకు ఫుల్‌స్టాప్ పెట్టి కొత్తగా, కొత్త తరహా ఫార్మాట్, కొత్త కథలకు శ్రీకారం చుట్టకపోతే మళ్లీ మళ్లీ ఇలాంటి ఫలితాలే చూడాల్సి రావొచ్చు. రొటీన్ సినిమాలు చూసే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చడం అనేది ప్రశ్నార్థకమే. మొత్తానికి గోపీచంద్ కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఇదో కుదుపుగా చెప్పాలి.

-త్రివేది