మెయిన్ ఫీచర్

కావలసినవి
సోయాబీన్ - 1/2 కప్పు
ఉల్లిపాయ -1
టమాటా -1
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - 2టీ.స్పూ.
మిరియాల పొడి - 1/4 టీ.స్పూ.
చాట్ మసాలా పొడి -1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
చేయండి ఇలా
సోయాబీన్స్ తగినన్ని నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టి కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత వడకట్టాలి. ఒక గినె్నలో ఉడికించిన సోయా బీన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాలపొడి, చాట్ మాసాల, ఉప్పు వేసి కలిపి చల్లగా తింటే బావుంటుంది.
Add new comment