క్రీడాభూమి

సెమీస్‌కు దూసుకెళ్లిన సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 8: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘తెలుగు తేజం’ పివి.సింధు క్వార్టర్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న సైనా నెహ్వాల్ శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌టిప్ బురనప్రసెర్సుక్‌పై చెమటోడ్చి విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తొలి గేమ్‌ను 19-21 తేడాతో కోల్పోయిన సైనా నెహ్వాల్ ఆ తర్వాత పుంజుకుని పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి ఆడింది. ఫలితంగా 21-14, 21-14 తేడాతో వరుసగా రెండు గేములను కైవసం చేసుకుని 58 నిమిషాల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. గత ఎనిమిది మ్యాచ్‌లలో ఏడుసార్లు పోర్న్‌టిప్‌ను ఓడించిన సైనా ఫైనల్‌లో స్థానం కోసం శనివారం చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు ఇంగ్‌తో తలపడనుంది. తై జును ఎదుర్కోవడంలో సైనా ఎంతో వెనుకబడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తై జుతో సైనా గతంలో 13 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు మాత్రమే నమోదు చేసింది. గత నెలలో ముగిసిన ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ సహా ఇటీవల సైనాతో ఆడిన ఐదు మ్యాచ్‌లలో తై జు విజయం సాధించింది.
ఇదిలావుంటే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న ‘తెలుగు తేజం’ పివి.సింధు సెమీఫైనల్‌కు ముందే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించి అభిమానులను నిరాశరపర్చింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఆమె 7-21, 8-21 గేముల తేడాతో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ ఇతనోన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. గత ఏడాది కొరియా ఓపెన్ టోర్నీలో ఇతనోన్‌ను ఓడించిన సింధు ఈసారి కేవలం 29 నిమిషాల్లోనే ఓటమిపాలవడం గమనార్హం. ఇతనోన్‌తో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన సింధుకు ఇది నాలుగో ఓటమి.