జాతీయ వార్తలు

పాతికేళ్ల వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: పాతికేళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కలిసిపోయారు. మెయిన్‌పురిలో ములాయం సింగ్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూలాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ మాయావతిని గౌరవించాలని అన్నారు. కోనే్నళ్ల తరువాత మాయావతితో వేదికను పంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇది నా కర్మభూమి అని ఇక్కడ నన్ను మరోసారి గెలిపించాలని, మరోసారి తనపై గౌరవాన్ని ప్రేమను చూపాలన్నారు. సభలో మాయావతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసమే తాము మళ్లీ కలిశామని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ వెనుకబడిన వర్గాల వారి కోసం ఎంతో చేశారని, ఇప్పటికీ ఆయనను తమ నాయకుడిగా ఆ వర్గాల ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాల వారికి మోదీ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల పేదలకు ఒరిగిందేమి లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామని, ములాయంకు సరైన వారసుడు అఖిలేష్ యాదవ్ అని అన్నారు.