జాతీయ వార్తలు

గ‘ఘన’ విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015
============
అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ అద్వితీయమైన విజయాలను నమోదు చేసుకున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష అధ్యయన పరిశోధనా సంస్థ ఇఎస్‌ఏ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన ప్రగతి మానవాళిని సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసింది. అంగారకుడిని అందుకోవడంతోపాటు మంచు గ్రహమైన ఫ్లూటోను కూడా నాసా పంపిన వ్యోమనౌక చేరుకోగలిగింది. ఈ ఏడాదిలో ఐదు అద్భుతమై రోదసీ ఆవిష్కరణలు జరిగాయి. ఇతర గ్రహాల్లో నీటి జాడను, జీవ జాతులు ఉనికిని కనుగొనే దశగా ఇదో పెద్ద ముందడుగు.
అదరగొట్టిన ఇస్రో
రోదసీ పరిశోధనలో తనదైన శైలితో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. పిఎస్‌ఎల్‌వి-సి30 రాకెట్ ద్వారా ఏకకాలంలో ఆరు విదేశీ ఉపగ్రహాలను ఏస్ట్రోశాట్ పేరుతో విజయవంతంగా ప్రయోగించగలిగింది. అత్యంత సుదూరమైన నక్షత్రాలను పరిశోధించడానికి అలాగే రోదసీ కిరణాల మూలాలను ఏకకాలంలో తెలుసుకోవాలన్నదే ఏస్ట్రోశాట్ లక్ష్యం. ప్రయోగించిన నెల తిరగకుండానే ఏస్ట్రోశాట్ ఓ టెలిగ్రాంను కూడా అక్కడి నుంచి పంపడం అద్భుతమే.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ విజయం
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహ విజయం దేశీయ అవసరాలను అనేక కోణాల్లో తీర్చడానికి ఉద్దేశించింది. ఈ ప్రయోగం ద్వారా ట్రాకింగ్, మ్యాపింగ్ వంటి కీలక సేవలను సమకూర్చుకునేందుకు భారత్‌కు అవకాశం కలిగింది. దీంతోపాటు జిశాట్-6 కమ్యూనికేషన్ల ఉపగ్రహం ప్రయోగం కూడా విజయవంతం కావడం అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సాధించిన పట్టుకు అద్దం పట్టింది. దీనిద్వారా అత్యంత ఆధునికమైన ఎస్‌బ్యాండ్ అంటెనాను రోదసీలోకి ప్రవేశపెట్టగలిగింది. ఇప్పటి వరకూ ఆరు మీటర్ల వెడల్పుగలిగిన అంటెనాను ఏ ఉపగ్రహం ద్వారా ఇస్రో ప్రవేశపెట్టలేదు.
మొదట్లో దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతరిక్ష ప్రయోగాలను చేపడుతూ వచ్చిన ఇస్రో విజయాలు అనేక దేశాలను ఆకర్షించాయి. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను చేపట్టడమే కాకుండా వాటిని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంలోనూ ఇస్రో విజయవంతమైంది. యుకెకు చెందిన ఐదు ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. పిఎస్‌ఎల్‌వి 30 ప్రయోగాల్లో 29 ప్రయోగాలు అనుకున్న విజయాన్ని సాధించగలిగాయి. వీటితోపాటు సింగపూర్‌కు చెందిన మరో ఆరు ఉపగ్రహాలను సైతం పిఎస్‌ఎల్‌వి-సి 29 ద్వారా విజయవంతంగా రోదసీలోకి పంపారు.
అంతరిక్షంలో సన్‌ఫ్లవర్ గెలాక్సీ
ఖగోళ పరిశోధనల్లో హబుల్ టెలీస్కోపు మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేసింది. రోదసీ లోతుల్లోకి చొచ్చుకుపోతూ ఎన్నో కొత్త గ్రహాల సమాచారాన్ని, నక్షత్ర మండలాల ఉనికిని వెలుగులోకి తెస్తున్న హబుల్ టెలీస్కోప్ తాజాగా సన్‌ఫ్లవర్ గెలాక్సీని గుర్తించగలిగింది. అదే విధంగా నెబులాకు సంబంధించిన రోదసీ అవశేషాలను పసిగట్టగలిగింది.
మార్స్ లోతుల్లోకి మంగళయాన్
గత ఏడాది మార్స్ మిషన్‌తో అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించిన మంగళయాన్ ఉపగ్రహం తిరుగులేని రీతిలో చాయాచిత్రాలను పంపించింది.
ఏడాదిపాటు మంగళయాన్ పరిభ్రమణం పూర్తికావడమే కాకుండా, ఏ రకమైన సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడం ఇతర గ్రహాలపైకి పరిశోధనలు చేపట్టడానికి అవసరమైన శక్తిని ఇస్రో సంతరించుకుంది. మంగళయాన్‌లోని అనేక శక్తివంతమైన కెమెరాలు అంగారక గ్రహ త్రిడి ఇమేజ్‌లతోపాటు ఎన్నో వౌలిక వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించాయి.
అంగారకుడిలో జల సంపద
మూడేళ్ల క్రితం క్యూరియోసిటీ రోవర్‌ను అంగారక గ్రహంపైకి పంపిన నాసా తొలిసారిగా ఆ గ్రహ ఉపరితల లోతుల్లో నీటి ఆనవాళ్లు ఉన్నట్టుగా నిర్ధారించింది. నీరున్న చోట జీవరాశి ఉద్భవానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాసా చేసిన ఈ ఆవిష్కరణ అంగారకుడిపై ఏదో ఒక దశలో జీవరాశి మనుగడ సాగించి ఉంటుందన్న వాదనకు బలాన్ని ఇచ్చింది.