సాహితి

ఒకరోజు నాకూ ఆకాశానికి
స్పర్ధ ఏర్పడింది!
నేను చిరునవ్వు తీస్తే,
అది వేకువను తీసిపెట్టింది!
నేను కన్నీళ్ళను తీస్తే,
అది వర్షాన్ని తీసిపెట్టింది!
నేను చెమట చుక్కల్ని తీస్తే,
అది నక్షత్రాల్ని తీసిపెట్టింది!
నేను కోపాన్ని తీస్తే,
అది ఎండను తీసిపెట్టింది!
నేను ప్రేమను తీస్తే,
అది చంద్రుణ్ణి తీసిపెట్టింది!
నేను భావాల్ని తీస్తే,
అది మేఘాల్ని తీసిపెట్టింది!
నేను అక్షరాల్ని తీస్తే,
అది మెరుపుల్ని తీసిపెట్టింది!
నేను మాటల్ని తీస్తే
అది ఉరుముల్ని తీసిపెట్టింది!
నేను కవితను తీస్తే,
అది ఇంద్రధనుస్సును తీసిపెట్టింది!
నేను నిద్రను తీస్తే,
అది రాత్రిని తీసిపెట్టింది!
నేను సందేహాలను తీస్తే,
అది గ్రహణాలను తీసిపెట్టింది!
నేను నిట్టూర్పును తీస్తే,
అది తుఫాన్ని తీసిపెట్టింది!
చివరకు నేను
నవనవీన లక్ష్యాలతో ముందుకు సాగే
నా పాదాలను తీసిపెట్టాను!
ఆకాశం ఓడిపోయింది!
Comments
rama (not verified)
Wed, 02/22/2012 - 15:23
Permalink
spardha
Add new comment