రాష్ట్రీయం

స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: స్పీకర్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని, వ్యక్తిగతంగా తమ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వలేదని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అందుకే నోటీసు ఇచ్చామన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అధికార పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తమకు ఇచ్చినవి ఒక మాదిరిగా, అందుకు భిన్నంగా టిడిపికి ఇచ్చినవి ఉన్నాయన్నారు. వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యేలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించలేదన్నారు. కాని వైకాపా ఎమ్మెల్యే రోజా ఎడిటెడ్ వీడియో క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాకు విడుదల చేశారన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టిడిపి ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ చౌదరి వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన అభ్యంతర వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు.