ఆంధ్రప్రదేశ్‌

జగన్-యనమల సంవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రూల్స్‌ను పాతరపెడుతున్నారు: జగన్
* సభకు అధికారాలున్నాయి: యనమల
హైదరాబాద్, మార్చి 15 : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా మంగళవారం యనమల శాసనసభా వ్యవహారాల మంత్రి రామకృష్ణుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య గంభీరమైన చర్చ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం శాసనసభ సమావేశం కాగానే స్పీకర్ కోడెల మాట్లాడుతూ, స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన వైకాపా ఎమ్మెల్యేలు కె. శ్రీధర్‌రెడ్డి తదితరులు ఇచ్చిన నోటీసును చర్చకు చేపడతున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేందుకు శాసనసభ నియమావళి 71 ప్రకారం 14 రోజుల వ్యవధి అవసరమన్నారు. శాసనసభ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం చర్చకు 14 రోజుల గడవు అవసరమని, అలాగే కౌల్ అండ్ షక్దర్ రాసిన పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం కూడా 14 రోజుల గడవు అవసరమన్నారు. అవిశ్వాస తీర్మానంపై సభ్యులు తీసుకునే నిర్ణయం కోసం విప్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు.