జాతీయ వార్తలు

సామాజిక మాధ్యమంతో వినూత్న ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: జలప్రళయానికి గురైన చెన్నైలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్‌డిఆర్‌ఎఫ్ సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని చేరుకోవడం కోసం సామాజిక మాధ్యమాన్ని, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటోంది. అంతేకాదు బాధితులకు సాయం అందేలా చూడడం కోసం న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక డెస్క్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్‌కు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా ఇప్పటివరకు కీలక సమాచారంతో కూడిన వెయ్యికి పైగా సందేశాలు రాగా, సాయం అవసరమైన వారికి తగిన సమాధానాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. దాదాపు డజను మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన బృందంతో ఏర్పాటు చేసిన ఈ దశానికి చెందిన ఐటి విభాగం రోజులో 24 గంటలూ పని చేసే విధంగా ఏర్పాటు చేసారు. చెన్నైలో ఉండే వారికి సహాయం కోసం మెస్సేజిలు పంపే వారికి మెస్సేజిలను నోట్ చేసుకున్నాం, అవసరమైన సాయం అందిస్తాం, మీ మెస్సేజిని నోట్ చేసుకుని ఫీల్డ్ బృందాలకు పంపించడం జరిగింది, దయచేసి మీ పూర్తి అడ్రసు ఇవ్వండి లాంటి సమాధానాలను కూడా ఈ విభాగం పోస్టు చేస్తోంది. తమ బృందానికి వచ్చే సోషల్ మీడియా రెస్పాన్స్‌లపైన ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఒపి సింగ్ వ్యక్తిగత మొబైల్ ఫోన్‌కు గంటకోసారి తాజా వివరాలు కూడా అందుతాయి. ప్రతి ట్వీట్, ఇ-మెయిల్, వాట్సప్ మెస్సేజ్, ఎస్‌ఎంఎస్, లేదా ఫోన్‌కాల్‌ను అందుకుని తిగిన సమాధానం ఇవ్వాలని ఆయన తమ బృందాన్ని ఆదేశించడం కూడా జరిగింది. గత మూడు నాలుగు రోజులుగా ఇలాంటి మెస్సేజిలు అందుతున్నాయని, మొదట్లో తాము సమాచారం తెలుసుకొని తక్షణ చర్య కోసం దాన్ని చెన్నై, అరక్కోణంలో ఉండే తమ ఫీల్డ్ బృందాలకు పంపించే వాళ్లమని ఆయన చెప్పారు. అయితే వ్యక్తిగతంగా సాయం కోరే వారు, లేదా వారి కుటుంబ సభ్యులు, మిత్రులకు వ్యక్తిగతంగా భరోసా ఇవ్వడం అవసరమని భావించి ఈ విధంగా తిరిగి మెస్సేజిలను పంపించడం జరుగుతోందని శుక్రవారం చెన్నై బయలుదేరి వెళ్లే ముందు విలేఖరులతో మాట్లాడుతూ సింగ్ చెప్పారు. ఇలా చేయడం వల్ల సగం పని అయినట్లవుతుందని, తమ గోడు విన్నారని, సాయం అందిస్తారన్న భరోసా అవతలి వారిలో కలుగుతుందని ఆయన చెప్పారు.