జాతీయ వార్తలు

స్పైస్‌జెట్‌లో పసిపాప మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్న నాలుగు నెలల పసిపాప మృతి చెందింది. తెల్లవారు జామున ఐదు గంటలకు ప్రీతి జిందాల్ అనే మహిళ తన నాలుగు నెలల పసిపాప, అత్తమామలతో కలిసి విమానం ఎక్కారు. విమానం ఎక్కిన వెంటనే ఆ పసిబిడ్డకు తల్లి పాలిచ్చింది. పాలు తాగి పాప నిద్రపోయింది. పాప నిద్రపోతుంది అని అనుకున్నారు. కాని విమానం ముంబయి వచ్చి దిగిన తరువాత పాపలో చలనంలో కనిపించకపోవటంతో విమాన సిబ్బందికి సమాచారం అందించారు. వెంటేనే ఆ పసిపాపను నానావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి చనిపోయింది. చిన్నారి మృతికి కారణాలు తెలియాల్సి వుంది.