అక్షర

ఆధ్యాత్మిక అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక పౌర్ణమి
(స్వప్న మధురిమలు)
వెల: అమూల్యం
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

మహాకవి కాళిదాసు ‘రఘువంశం’ అనే తన కావ్యాన్ని పార్వతీ పరమేశ్వరులకు అంకితమిచ్చాడని ఎరుగుదుము. కానీ ఆ కావ్యాన్ని ప్రారంభిస్తూ ‘వాగర్థావివ సంపృక్తౌ’ అని అంటాడు. ఒక మాట అర్థం మరొక మాట అర్థంతో ఏ విధంగా మమేకవౌతుందో, ఆ విడదీయలేని బంధానికి పార్వతీ పరమేశ్వరులే ప్రతీకలని అర్థం. మన ఇతిహాసాల్లో, పురాణాల్లో దంపతులను దర్శిస్తుంటాం. మహర్షులు వారిని లౌకిక బంధంతో ప్రతిష్ఠించలేదు. నిజానికి వారి మధ్య నెలకొల్పిన అనురాగ బంధం మన లౌకిక బంధం వంటిది కాదు. అది అలౌకికం, అమరం, తత్త్వాన్ని అనుసంధానించే ఆధ్యాత్మిక అనుబంధం అది. మనం వారిని లౌకిక దృష్టితోనే చూస్తూ అనేక రకాలైన ఊహాగానాల్లో విహరిస్తుంటాం. మహర్షులు ప్రతిష్ఠించిన ధర్మబంధం ఆదర్శప్రాయం. లోక కళ్యాణానికి దోహదపడే విధంగా వారు ఆ పాత్రలను తీర్చిదిద్దారు. ఆ ఆదర్శ మూర్తులను అనుసరించి, వారి ఆదర్శాలను ఆచరించి లోక కళ్యాణానికి మానవజాతి పూనుకోవాలనేది ఆ మహానుభావుల ఏకైక లక్ష్యం. మానవ మేధస్సు పరిమితి కలది, ద్వంద్వం మీదనే ఆధారపడి అవగాహన చేసుకోగలిగి ఉండటం చేత, వారు ఆ పాత్రలను మానవ అవగాహన కొరకు లౌకిక రీతిలో చిత్రించారు. వాల్మీకి మహర్షి సృష్టించిన పాత్రలన్నీ నేటికీ ఆదర్శప్రాయమై విలసిల్లుతున్నాయి. ఏది ఏమైనా మానవ జీవితాన్ని వాస్తవిక దృష్టితోనే ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో ‘గీత’లోని కొన్ని ముఖ్యాంశాలను పొందుపరిచారు.
*