AADIVAVRAM - Others

నేర్చుకోదగ్గ విషయం (స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ నించి వచ్చిన మయూరేష్‌ని తల్లి అడిగింది.
‘అక్క క్లాస్ టీచర్ రెడ్‌క్రాస్‌కి విరాళం ఇవ్వమని చెప్పిందిట. ఏభై రూపాయలు తీసుకెళ్లింది. మీ క్లాస్ టీచర్ అడగలేదా?’
‘అడిగారు’
‘మరి నాకు చెప్పలేదే?’
‘అది వృధా ఖర్చని’
‘రెడ్‌క్రాస్‌కి ఇచ్చేది వృధా అని ఎవరు చెప్పారు? యుద్ధ సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో వాళ్లు అనేక మందికి సహాయం చేస్తూంటారు’
‘మన దేశంలో యుద్ధం జరగనప్పుడు ఆ సంస్థకి ఇవ్వడం వృధా ఖర్చే కదా? నాకు ఇవాళ నిమ్మకాయ షర్బత్‌ని చేసివ్వమ్మా’ మయూరేష్ కోరాడు.
‘అలాగే. నిమ్మకాయ కోసుకు వస్తే చేసిస్తాను’
మయూరేష్ ఇంటి వెనక ఉన్న నిమ్మచెట్టు దగ్గరికి వెళ్లి ఓ నిమ్మపండుని కోసుకువచ్చాడు. దాంతో షర్బత్ చేసిస్తూ తల్లి చెప్పింది.
‘మీ తాతయ్య కూడా నీలా ఆలోచించి ఉంటే ఈ రోజు నువ్వు ఈ షర్బత్ తాగేవాడివి కాదు’
మయూరేష్ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘పదేళ్ల క్రితం మీ తాతయ్య నర్సరీ నించి రెండు నిమ్మ చెట్లని కొనుక్కొచ్చి పాతారు. ఒకటి చచ్చిపోయింది. కాని ఇంకోటి బతికింది. ‘నేను ఈ చెట్టుకి కాయలు కాసేదాకా జీవించను. ఆ మొక్కని కొనడం వృధా ఖర్చు’ అని మీ తాతయ్య అనుకుని ఉంటే?’
మయూరేష్ జవాబు చెప్పలేదు.
‘మనకి ఫలితం వస్తేనే ఏదైనా చేస్తూంటాం. మన సమయం, డబ్బులలో కొంతభాగం కాక ఇతరులకి ఇస్తూండాలి’ తల్లి సూచించింది.
‘వాటి నీడని కాని, పళ్లని కానీ తను పొందలేడని తెలిసి కూడా తాతయ్య అనేక చెట్లని పెంచినట్లుగానా?’ మయూరేష్ ప్రశ్నించాడు.
‘అవును. బయట ముప్పై ఎనిమిది డిగ్రీల ఎండ ఉండబట్టే నువ్వు నిమ్మకాయ షర్బత్ తాగాలనుకున్నావు. ఎవరికి తెలుసు? రేపు ఎప్పుడైనా యుద్ధం వచ్చి, మననో, మన పిల్లల్నో రెడ్ క్రాస్ మనం ఇచ్చే డొనేషన్ లోంచే ఆదుకోవచ్చేమో?’
మర్నాడు మయూరేష్ తల్లి ఇచ్చిన ఏభైతో పాటు తన పాకెట్ మనీలోంచి పదిహేను రూపాయలు కూడా కలిపి రెడ్‌క్రాస్‌కి విరాళం ఇచ్చాడు.
ఛారిటీ వర్క్ నెవర్ గోస్ వేస్ట్

మల్లాది వెంకట కృష్ణమూర్తి