AADIVAVRAM - Others

లోపలి హెచ్చరిక (స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రథమ్ తన ఐదుగురు మిత్రులతో ఓ ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన మిత్రుడి తోటకి వెళ్లాడు. తోటమాలి వారికి తేగలని కాల్చి ఇచ్చాడు. తోటమాలి భార్య పూతరేకుల్ని, చెరకు రసాన్ని ఇచ్చింది. చివరకి వాళ్లు ఓ జామ చెట్టు దగ్గరికి వెళ్ళారు. అందరికన్నా ఎవరు ఎక్కువ ఎత్తు ఎక్కుతారా అని పందెం వేసుకున్నారు. ఐదుగురు ఎక్కాక చివరగా ప్రథమ్ ఆరో వాడిగా చెట్టెక్కాడు.
‘చాలా ఎత్తు ఎక్కావు. ఇంక దిగిపో’ పిల్లలు అరిచారు.
కాని ప్రథమ్ తన ప్రతిభని చూపించాలనే తపనతో ఇంకో కొమ్మ పైకి ఎక్కాడు. వాడి బరువుని ఆపలేక అది విరగడంతో కింద పడ్డాడు. తన కాల్లోని ఎముక విరిగిన శబ్దం ప్రథమ్‌కి వినిపించింది. తక్షణం నొప్పి కూడా ఆరంభం ఐంది. పిల్లల అరుపులకి తోటమాలి పరిగెత్తుకు వచ్చి ప్రథమ్‌ని ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకెళ్లాడు. డ్రైవర్ వెంటనే కారుని సరాసరి హాస్పిటల్‌కి పోనించాడు.
ప్రథమ్ కళ్లు తెరిచేసరికి తల్లిదండ్రులు కనిపించారు.
‘ఎలా ఉంది?’ తల్లి అడిగింది.
‘నొప్పి తెలీడం లేదు’
‘అంత పైకి చెట్టెక్కడం సరైన పని కాదని అర్థం ఐందా?’
‘ఐంది. నిజానికి అప్పుడే అంత పైకి ఎక్కకూడదని నాకు అనిపించింది. ఐనా ఎక్కాను’
‘అలా ఎప్పుడైనా అనిపిస్తే ఇక తక్షణం ఆ పనిని చేయడం విరమించుకోవాలి. లోపల నించి పరమాత్మ వద్దని చెప్పినప్పుడు మనకి అలా అనిపిస్తూంటుంది’ తండ్రి చెప్పాడు.
‘నిజంగా?’
‘అవును. మనలో ఉండే పరమాత్మ చేసే పనుల్లో ఒకటి మనం తప్పు చేయకుండా సరైన మార్గంలో వెళ్లేలా సూచించడం. చేసేది తప్పు లేదా ప్రమాదం అని ముందే మనకి అనిపించేలా చేస్తాడు’
‘ఈసారి నేను పరమాత్మ చెప్పేది వింటాను. వినుంటే నా కాలు విరిగేది కాదు’ ప్రథమ్ చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి