AADIVAVRAM - Others

ఎర్రలైట్ (స్ఫూర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాజిని, మిగతా ఫ్రెండ్‌ని రేపు సాయంత్రం వాళ్లింటికి ఆడుకోడానికి శ్రీకరి పిలిచింది. కానీ నన్ను పిలవలేదు. ఇక నించి శ్రీకరి నా బెస్ట్‌ఫ్రెండ్ కాదు. అదంటే నాకు కోపం’ స్కూల్‌లోంచి బయటకి వచ్చి కారెక్కిన నియమిత తల్లితో చెప్పింది.
‘నీనించి ఇలాంటి మాటలు వినడం నాకిష్టం లేదు. దానర్థం నీలో ఏదో లోపం ఉందని’ నియమిత తల్లి వెంటనే చెప్పింది.
ఆమె కారుని స్టార్ట్ చేసింది. వెంటనే డాష్ బోర్డ్‌లో వెలిగిన ఎర్రలైట్‌ని చూసి నియమిత అడిగింది.
‘అదేమిటి?’
తల్లి దాన్ని చూసి జవాబు చెప్పింది.
‘నాకు తెలీదు. చెక్ ఇంజన్ దగ్గర వెలిగింది. నిన్ను ఇంటి దగ్గర దింపాక, కారుని మెకానిక్ దగ్గరకి తీసుకెళ్లమని నాన్నకి చెప్పాలి’
ఇంటికి చేరుకున్నాక తల్లి నియమితకి టిఫిన్ పెట్టింది. శ్రీకరి మీద గొణుగుతూనే టిఫిన్ తిని నియమిత చెప్పింది.
‘నేను దానికి ఫోన్ చేసి, దాంతో కటీఫ్ చెప్పేస్తాను’
‘ఇంక ఆ విషయాన్ని వదిలెయ్’ తల్లి సలహా ఇచ్చింది.
ఆఫీస్ నించి భర్త వచ్చాక అత, తల్లి, నియమిత దగ్గరలోని మెకానిక్ దగ్గరికి కారులో వెళ్లారు. మెకానిక్ వెలిగే ఆ లైట్‌ని చూసి బోనెట్ ఎత్తి మెకానికల్ సమస్యని కనుగొని దాన్ని రిపేర్ చేస్తూంటే, తల్లితో నియమిత చెప్పింది.
‘మనం ఎర్రలైట్‌ని గమనించడం మంచిదైంది. లేదా సమస్య కొనసాగేది’
‘నేను ఇవాళ ఇంకో ఎర్రలైట్‌ని కూడా చూశాను’ తల్లి చెప్పింది.
‘ఇంకోటా? ఒకటేగా వెలిగింది?’ నియమిత అడిగింది.
‘ఇంకోటి కారుకి సంబంధించింది కాదు. నీకు సంబంధించింది. శ్రీకరి విషయంలో నీ మాటలే ఆ ఎర్రలైట్. నీ మనసులోని సమస్యని ఆ మాటలు ఎర్రలైట్‌లా బయటకి చెప్పాయి. శ్రీకరికి తనకి ఇష్టమైన వాళ్లని ఇంటికి ఆడుకోడానికి పిలిచి, ఇష్టం లేని వాళ్లని పిలవక్కర్లేని హక్కు ఉంది. దాన్ని తను వినియోగించుకునే స్వతంత్రాన్ని నువ్వు శ్రీకరికి ఇవ్వదల్చుకోలేదని నీ మాటలని బట్టి అర్థవౌతోంది. అంటే నీ మనసులోకి కల్మషం ప్రవేశించిందన్నమాట. శ్రీకరి ఎవర్ని పిలవాలో, ఎవర్ని పిలవకూడదో నీ ఉద్దేశం బట్టి నడుచుకోవాలి అని నువ్వు అనుకోవడం కల్మషం కిందకే వస్తుంది.’
కొద్ది క్షణాలు ఆలోచించి నియమిత చెప్పింది.
‘నిజమే. నేనీ విధంగా ఆలోచించలేదు’
మర్నాడు నియమిత స్కూల్ నించి వచ్చాక తల్లితో చెప్పింది.
‘శ్రీకరి నన్ను పిలవకపోవడానికి కారణం తెలిసింది. ఆడడానికి ఇద్దరిద్దర్ని పిలిచింది. నాకు జంట లేక పిలవలేదు’

మల్లాది వెంకట కృష్ణమూర్తి