క్రీడాభూమి

యూరో క్వార్టర్స్‌కు పోర్చుగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెన్స్ (ఫ్రాన్స్), జూన్ 26: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రికార్డో కరేస్మా చేసిన గోల్ పోర్చుగల్‌కు క్రొయేషియాపై 1-0 తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి పోర్చుగీస్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో ఎక్కువ సేపు ఉంచుకున్నప్పటికీ క్రొయేషియా రక్షణ వలయాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. కొన్ని ప్రయత్నాలు చేసినా, క్రొయేషిడా గోల్‌కీపర్ వాటిని అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో, ద్వితీయార్ధంలో ఇరు జట్లు దూకుడుగా ఆడతాయని అభిమానులు ఆశించారు. కానీ, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. పోర్చుగీస్ ఫార్వర్డ్‌కు క్రొయేషియా డిఫెన్స్ దీటైన సమాధానం ఇచ్చింది. దీనితో ద్వితీయార్ధంలోనూ గోల్స్ నమోదుకాలేదు. ఇంజురీ టైమ్‌లోనూ ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీనితో ఎక్‌స్ట్రా టైమ్ అనివార్యమైంది. 117వ నిమిషంలో కరేస్మా మెరుపు వేగంతో దూసుకొచ్చి, క్రొయేషియా రక్షణ వలయాన్ని ఛేదించి గోల్ చేశాడు. కాగా, క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన పోర్చుగల్‌కు అక్కడ పోలాండ్ ఎదురుకానుంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనివార్యంగా మారిన పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో పోలాండ్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే.
వేల్స్ ముదంజ: వేల్స్ జట్టు కూడా ముందంజ వేసింది. మరో ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో ఈ జట్టు 1-0 తేడాతో నార్తన్ ఐర్లాండ్‌ను ఓడించింది. మ్యాచ్ 75వ నిమిషంలో గెరాత్ మెక్లే చేసిన గోల్ ఆ జట్టుకు విజయాన్ని అందించింది.