క్రీడాభూమి

స్టార్ల టార్గెట్ వింబుల్డన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 26: టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. ఇద్దరూ తమతమ టైటిళ్లను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. జొకోవిచ్ ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించి ఊపుమీద కనిపిస్తుండగా, సెరెనా ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన రెండు గ్రాండ్‌శ్లామ్స్‌లోనూ ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ సాధించలేకపోయిన సెరెనా వింబుల్డన్‌ను ఒక సవాలుగా స్వీకరించింది.
ఫామ్‌లో జొకోవిచ్
సెర్బియా ఆటగాడు జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న కలను నెరవేర్చుకొని, మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలను గెల్చుకొని, క్యాలెండర్ శ్లామ్‌ను దిశగా మరో అడుగు ముందుకేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఆండీ ముర్రేను 6-1, 7-5, 7-6 తేడాతో ఓడించిన జొకోవిచ్ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ అదే ప్రత్యర్థిని చిత్తుచేశాడు. గతంలో 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం విఫలయత్నం చేసిన జొకోవిచ్ పనె్నండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఫైనల్‌లో ముర్రేను 3-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఓడించాడు. కెరీర్‌లో అతనికి ఇది 12వ టైటిల్. దీనితోపాటు అతని ఖాతాలో ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లున్నాయి. అతను 2008, 2011, 2012, 2013, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచి, ఈఏడాది టైటిల్ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్‌ను 2011, 2014, 2015 సంవత్సరాల్లో కైవసం చేసుకున్న అతను నాలుగోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. కాగా, 2011లో మొదటిసారి, 2015లో రెండోసారి యుఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను అందుకున్న ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాలన్న అతని ప్రయత్నం ఎంత వరకూ నెరవేరుతుందో చూడాలి. 1938లో డాన్ బడ్జ్ తొలిసారి ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించి చరిత్ర సృష్టించాడు. ఓపెన్ శకం మొదలైన తర్వాత రాడ్ లెవర్ 1962లో ఒకసారి, 1969లో మరోసారి ఈ ఫీట్‌ను ప్రదర్శించాడు. వీరిద్దరి సరసన చోటు సంపాదించుకునే అవకాశం నిరుడు అతనికి తృటిలో చేజారింది. ఆస్ట్రేలియా, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను అతను కైవసం చేసుకున్నప్పటికీ, ఫ్రెంచ్ ఓపెన్‌లో అందుకోలేకపోవడంతో క్యాలెండర్ గ్రాండ్ శ్లామ్ పూర్తికాలేదు. అయితే, ఫ్రెంచ్ ఓపెన్‌లో అంతకు ముందు 11 పర్యాయాలు చేసిన ప్రయత్నాలు విఫలంకాగా ఈసారి టైటిల్ సాధించడంతో అతని ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వింబుల్డన్‌ను, ఆతర్వాత ఏడాదిలో చివరిదైన యుఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకొని క్యాలెండర్ గ్రాండ్ శ్లామ్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు శ్రమిస్తున్నాడు.
ప్రధాన ప్రత్యర్థి ముర్రే
ఈఏడాది జరిగిన రెండో గ్రాండ్ శ్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మాదిరిగానే వింబుల్డన్‌లోనూ జొకోవిచ్‌కు ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది. అదే విధంగా వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ కూడా టైటిల్ వేటలో ఉన్నాడు. 2013లో వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన ముర్రే స్వదేశంలో, వేలాది అభిమానుల సమక్షంలో మరోసారి ట్రోఫీని స్వీకరించాలని కోరుకుంటున్నాడు. అదే విధంగా కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించి రికార్డు సృష్టించిన ఫెదరర్ ఇప్పటి వరకూ ఏడు పర్యాయాలు వింబుల్డన్‌ను గెల్చుకున్నాడు. 2003, 2004, 2005, 2006, 2007, 2009 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన అతను చివరిసారి 2012లో వింబుల్డన్ ట్రోఫీని అందుకున్నాడు. పూర్తి ఫామ్‌లో లేకపోవడంతోపాటు వయసు పెరగడం కూడా ఫెదరర్‌ను వేధిస్తున్న సమస్యలు. గాయాల బాధ కూడా అతనిని వెంటాడుతున్నది. అయితే, తాను పూర్తిగా కోలుకున్నానని, వింబుల్డన్ టైటిల్ రేసులో ముందు వరుసలో ఉంటానని అతను స్పష్టం చేస్తున్నాడు. మొత్తం మీద జొకోవిచ్‌కు గట్టిపోటీనిచ్చేందుకు ముర్రే, ఫెదరర్ సిద్ధంగా ఉన్నారు.
రెండు వైఫల్యాలు
ప్రపంచ నంబర్ వన్ సెరెనా ఈఏడాది వరుసగా రెండు గ్రాండ్ శ్లామ్ టోర్నీలో విఫలమైంది. మూడోదైన వింబుల్డన్‌లో టైటిల్ సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావడమేగాక, కెరీర్‌లో అత్యధిక టైటిళ్లను కైవసం చేసుకున్న క్రీడాకారిణుల జాబితాలో రెండో స్థానాన్ని స్ట్ఫె గ్రాఫ్‌తో కలిసి పంచుకోవాలని ఆశిస్తున్నది. మార్గరెట్ కోర్ట్ 24 టైటిళ్లతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, స్ట్ఫె 22 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం సెరెనా ఖాతాలో 21 టైటిళ్లు ఉన్నాయి.
ముగురుజా నుంచి గట్టిపోటీ
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో తనను ఓడించిన స్పెయిన్ క్రీడాకారిణి గార్బినే ముగురుజా నుంచి సెరెనాకు గట్టిపోటీ తప్పదని విశే్లషకుల అభిప్రాయం. గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తానని సెరెనా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, గత రెండు గ్రాండ్ శ్లామ్ ఎదురైన వైఫల్యాలు ఆమెపై నమ్మకాన్ని పెంచలేకపోతున్నాయి. కెరీర్‌లో వరుసగా రెండుసార్లు గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్‌లో ఓడడం సెరెనాకు ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్ 6-4, 7-5, 7-6 తేడాతో సెరెనాను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగురుజా 7-5, 6-4 ఆధిక్యంతో వరుస సెట్లలో ఆమెను చిత్తుచేసింది. వరుసగా రెండు పర్యాయాలు టైటిల్‌ను గెల్చుకునే అవకాశాలను చేజార్చుకున్న సెరెనా వింబుల్డన్‌లో విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.

‘టాప్-10’ సీడింగ్స్
పురుషుల విభాగం: 1. నొవాక్ జొకోవిచ్ (16,950 పాయింట్లు), 2. ఆండీ ముర్రే (8,915), 3. రోజర్ ఫెదరర్ (6,425), 4. స్టానిస్లాస్ వావ్రిన్కా (5,035), 5. కెయ్ నిషికోరి (4,155), 6. మిలోస్ రవోనిక్ (3,175), 7. రిచర్డ్ గాస్క్వెట్ (2,905), 8. డామినిక్ థియెమ్ (3,175), 9. మారిన్ సిలిక్ (2,695), 10. థామస్ బెర్డిచ్ (2,950 పాయింట్లు). మహిళల విభాగం: 1. సెరెనా విలియమ్స్ (8,330 పాయింట్లు), 2. గార్బినె ముగురుజా (6,712), 3. ఆగ్నీస్కా రద్వాన్‌స్కా (5,875), 4. ఏంజెలిక్ కెర్బర్ (5,330), 5. సిమోనా హాలెప్ (4,372), 6. రాబర్టా విన్సీ (3,405), 7. బెలిండా బెన్సిక్ (2,775), 8. వీనస్ విలియమ్స్ (3,116), 9. మాడిసన్ కీస్ (3,061), 10. పీటర్ క్విటోవా (2,876 పాయింట్లు).

యుద్ధాలతో ఆటంకాలు
* మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా వింబుల్డన్ టోర్నీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల 1915 నుంచి 1918 వరకు వింబుల్డన్‌ను నిర్వహించలేదు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 1940 నుంచి 1945 వరకూ ఈ టోర్నీని నిలిపివేశారు. ఆ సమయంలోనే జర్మన్ సైన్యం వేసిన బాంబు వింబుల్డన్ టోర్నీ జరిగే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ సెంట్రల్ కోర్టుపై పడింది. 1,200 సీట్లు ధ్వంసంకాగా, కోర్టు కూడా దారుణంగా దెబ్బతింది. 1946లో వింబుల్డన్ పోటీలను తిరిగి మొదలుపెట్టినా, ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ స్టేడియం, సెంట్రల్ కోర్టులకు పూర్వ వైభవం రావడానికి మరో మూడు సంవత్సరాలు పట్టింది.
ముర్రే దురదృష్టం
టెన్నిస్ చరిత్రలో దురదృష్టవంతులైన ఆటగాళ్ల జాబితాలో బ్రిటిష్ స్టార్ ఆండీ ముర్రే పేరు కూడా చేరుతుంది. కెరీర్‌లో అతను 10 పర్యాయాలు మేజర్ టోర్నీల్లో ఫైనల్స్ చేరాడు. కానీ, రెండు సార్లు మాత్రమే టైటిళ్లను కైవసం చేసుకోగా, ఎనిమిది పరాజయాలను చవిచూశాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లో నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొని, మరోసారి రన్నరప్ ట్రోఫీకే పరిమితయ్యాడు. మేజర్ టోర్నీల్లో ఎదుర్కొన్న ఎనిమిది పరాజయాల్లో ఐదు జొకోవిచ్ చేతిలో ఎదురైనవే కావడం గమనార్హం. గ్రాండ్ శ్లామ్స్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో అతను 2010, 2011, 2013, 2015 సంవత్సరాలతోపాటు ఈ ఏడాది కూడా ఫైనల్ చేరాడు. కానీ, ప్రతిసారీ అతడిని ఓటమి వెక్కిరించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినా ఫలితం లేకపోయింది. ఫైనల్ చేరిన మిగతా రెండు సందర్భాల్లో (2005లో వింబుల్డన్, 2008లో యుఎస్ ఓపెన్) ముర్రే టైటిళ్లను సాధించాడు. మొత్తం మీద ఎక్కువ పర్యాయాలు మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో విఫలమైన ఆటగాళ్ల జాబితాలో ముర్రేకు కూడా స్థానం ఉంటుంది.

బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత
రిటైర్మెంట్ తీసుకోమన్నారు
తాజా పుస్తకంలో భారత రెజ్లర్ సుశీల్ వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 26: బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న వెంటనే చాలా మంది రిటైర్మెంట్ తీసుకోవాలంటూ తనకు సలహా ఇచ్చారని భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తన తాజా పుస్తకం ‘మై ఒలింపిక్ జర్నీ’లో వెల్లడించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకున్నప్పుడు 1952 తర్వాత రెజ్లింగ్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన తొలి రెజ్లర్‌గా సుశీల్ రికార్డు సృష్టించాడు. దేశ ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని పొందిన అనంతరం కెరీర్‌ను కొనసాగిస్తే, తాను అదే స్థాయిలో రాణించగలనా లేదా అన్న అనుమానం చాలా మందికి వచ్చిందని చెప్పాడు. కెరీర్‌లో టాప్‌గేర్‌లో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎంతో గౌరవంగానూ, హుందాగానూ ఉంటుందని చాలా మంది సన్నిహితులు తనకు సూచించారని సుశీల్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. వారి సూచనలో తప్పులేకపోయినా, రిటైర్‌కావాలన్న ఆలోచన తనకు లేకపోయిందన్నాడు. అయితే, వారంతా చెప్పిన సలహా వెనుక ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి మరింతగా శ్రమించానని తెలిపాడు. ఆ కృషి ఫలితంగానే లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్నట్టు తెలిపాడు. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సుశీల్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. చిన్నతనం నుంచే ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న లక్ష్యంతో తాను శ్రమించినట్టు చెప్పాడు. రెజ్లింగ్‌కు దేశంలో ఆదరణ పెరుగుతున్నదని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పతకాలను భారత్ సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
విండీస్ టూర్‌కు
బ్యాటింగ్ కోచ్ బంగార్
ముంబయి, జూన్ 26: వచ్చేనెల వెస్టిండీస్‌లో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు సంజయ్ బంగార్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. చీఫ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లేను ఎంపిక చేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇప్పుడు సపోర్టింగ్ స్ట్ఫా నియామకంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే బంగార్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. అదే విధంగా అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న కుంబ్లే స్వయంగా బౌలర్ కావడంతో, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ప్రత్యేకంగా బౌలింగ్ కోచ్ అవసరం లేదని బిసిసిఐ భావిస్తున్నట్టు సమాచారం.