క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు శాలీ పియర్స్ డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 29: ప్రపంచ మేటి హర్డిల్స్ రన్నర్, ఆస్ట్రేలియా అథ్లెట్ శాలీ పియర్స్ ఈఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆమె రియో ఒలింపిక్స్‌కు గోల్డ్ కోస్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే, ట్రైనింగ్ సెషన్‌లో ఆమె కాలి కండరాలు చిట్లినట్టు స్థానిక వార్తాపత్రికలు పేర్కొన్నాయి. ఆమె రియోకు వెళ్లడం అనుమానమేనని స్పష్టం చేశాయి. శాలీకి కనీసం రెండుమూడు వారాల విశ్రాంతి అవసరమవుతుంది కాబట్టి, పూర్తిగా కోలుకొని ఒలింపిక్స్‌కు హాజరుకావడం అసాధ్యమని వ్యాఖ్యానించాయి. అయితే, ఆస్ట్రేలియా అథ్లెటిక్స్ సమాఖ్యగానీ, ఒలింపిక్ సంఘంగానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఈనెల 18న శాలీ తన బ్లాగ్‌లో కండరాలు చిట్లాయని, ఎముక విరిగిందని పేర్కొంది. కానీ, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే విషయంపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న ఆమె వరుసగా మూడోసారి కూడా ఒలింపిక్ పతకంపై కనే్నసింది. ఆమె ప్రయత్నం సఫలమయ్యే సూచనలు మాత్రం కనిపించడంలేదు. ఇలావుంటే, పలువు రు ఆస్ట్రేలియా అథ్లెట్లు బ్రెజిల్‌లో వ్యాపిస్తున్న జికా వైరస్‌ను చూసి భయపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా కొందరు ఒలింపిక్స్ నుంచి వైదొలగే అవకాశాలున్నాయ.