క్రీడాభూమి

విమర్శలు హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 29: భారత మాజీ క్రికెటర్లు రవి శాస్ర్తీ, సౌరవ్ గంగూలీ మధ్య వివాదం క్రమంగా తీవ్ర రూపం దాలుస్తున్నది. భారత కోచ్ పదవికి తాను బ్యాంకాక్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు క్రికెట్ సలహా కమిటీ (సిఎసి)లో సభ్యుడైన గంగూలీ అక్కడ లేకపోవడాన్ని రవి శాస్ర్తీ విమర్శించడంతో వివాదం మొదలైంది. కమిటీలోని మిగతా ఇద్దరు సభ్యులు సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్‌తోపాటు కో-ఆర్డినేటర్ సంజయ్ జగ్దాలే కూడా రవి శాస్ర్తీని ఇంటర్వ్యూలో చేసిన వారిలో ఉన్నాడు. అయితే, గంగూలీ అక్కడ లేకపోవడాన్ని ప్రముఖంగా పేర్కొన్న రవి శాస్ర్తీ ఆ సంఘటనను తనకు జరిగిన అవమానంగా అభివర్ణించాడు. కాగా, అతని విమర్శలను గంగూలీ తిప్పికొట్టాడు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికాడు. ప్రస్తుతం తాను ఉన్న స్థానంలో సుమారు పదేళ్ల క్రితం రవి శాస్ర్తీ బిసిసిఐకి సేవలు అందించిన విషయాన్ని గంగూలీ గుర్తుచేశాడు. గత 20 సంవత్సరాలుగా బిసిసిఐలో ఏదో ఒక కమిటీలో ఉంటున్న రవి శాస్ర్తీకి కోచ్ ఎంపిక ఏ విధంగా జరుగుతుందో తెలియదా? అని ప్రశ్నించాడు. ఇద్దరు మాజీ క్రికెటర్లు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా తాను లేనని రవి శాస్ర్తీ విమర్శించడం అతని వెర్రి తనానికి నిదర్శనమని వ్యాఖ్యానించాడు.
ఎందుకు హాజరుకాలేదు?
నిజంగానే కోచ్ పదవిని కావాలనుకున్న రవి శాస్ర్తీ ఇంటర్వ్యూకి ఎందుకు హాజరుకాలేదని గంగూలీ నిలదీశాడు. బ్యాంకాక్‌లో సెలవులను గడుపుతూ, ఆన్‌లైన్ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించాడు. ఇంటర్వ్యూని రవి శాస్ర్తీ ఎంత వరకూ సీరియస్‌గా తీసుకున్నాడో తనకు తెలియదని, తన దృష్టిలో మాత్రం అతను తప్పక హాజరుకావాలని అన్నాడు. ఇంటర్వ్యూలు అంతకు ముందు రెండు రోజుల క్రితం ఖరారుకాగా, తాను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) పాలక మండలి సమావేశం రెండు వారాల ముందే ఖరారైందని గంగూలీ చెప్పాడు. అధ్యక్షుడిగా తాను తప్పకుండా ఆ సమావేశానికి హాజరుకావాల్సి వచ్చిందన్నాడు. సిఎబి సమావేశం పూర్తయిన తర్వాత తాను ఇంటర్వ్యూ తీసుకోవడానికి సిద్ధమయ్యానని అన్నాడు. అయితే, అప్పటికే ప్రక్రియ పూర్తికావచ్చిందని, కాబట్టి తాను అక్కడికి వెళ్లలేదని తెలిపాడు. ఇంటర్వ్యూకి హాజరుకాకపోవడం రవి శాస్ర్తీ తప్పని, దానిని కప్పిపుచ్చుకొని తనపై నిందలు వేయడం సరికాదని అన్నాడు. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలను మానుకోవాలని అతనికి హితవు పలికాడు.