క్రీడాభూమి

ధోనీ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 23: భారత పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్ రెండో క్వార్టర్ ఫైనల్‌లో చక్కటి ప్రదర్శనతో రాణించినప్పటికీ, అతని శ్రమ శృథా అయింది. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 99 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 38 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. ధోనీ 70 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
సెమీకు హెచ్‌పి
ఆలూర్: హిమాచల్ ప్రదేశ్ (హెచ్‌పి) విజయ్ హజారే టోర్నీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం పంజాబ్‌తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌లో ఈ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 263 పరుగలు చేసింది. అనంతరం హెచ్‌పి 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 266 పరుగులు సాధించి, విజయభేరి మోగించింది.