క్రీడాభూమి

బట్లర్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూలై 6: జొస్ బట్లర్ విజృంభణతో శ్రీలంకతో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటైంది. దనుష్క గుణతిలక 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేష్ చండీమల్ 23, కుశాల్ మేండిస్ 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 29 పరుగులకు మూడు, లియామ్ డాస్ 27 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు. లియామ్ ప్లంకెట్ 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లకు 144 పరుగులు చేసింది. బట్లర్ 49 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇయాన్ మోర్గాన్ 39 బంతుల్లో అజేయంగా 47 పరుగులు సాధించి, ఇంగ్లాండ్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ పర్యటనలో లంక జట్టు మూడు ఫార్మెట్స్‌లో కలిపి మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది. ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది.
ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లపై
సస్పెన్షన్ వేటు
మెల్బోర్న్, జూలై 6: పందెం కాసి, జూదానికి సహకరించిన ముగ్గురు క్రికెటర్లపై వేటు పడింది. వీరిలో ఇద్దరు మహిళా క్రికెటర్లు కావడం విశేషం. టి-20 కాంట్రాక్టు ఉన్న మహిళా క్రికెటర్లు హేలే జెనె్సన్, కొరిన్ హాల్‌తోపాటు ఫ్యూచర్స్ లీగ్‌లో ఆడే జోల్ లోగాన్‌పైన కూడా సస్పెన్షన్ వేటు వేసినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రకటించింది. జెనె్సన్, కొరిన్ 2015 నవంబర్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరు బెట్టింగ్‌కు పాల్పడినట్టు పేర్కొంది. అదే విధంగా లోగాన్ 2015 మార్చిలో జరిగిన టి-20 వరల్డ్ కప్ ఫలితాలపై బెట్టింగ్ చేశాడని తెలిపింది. ఈ ముగ్గురూ స్వయంగా పందెం కాయడమేకాక, బెట్టింగ్‌కు సహకరించారని వివరించింది. ముగ్గురినీ రెండేసి సంవత్సరాలు సస్పెండ్ చేసినట్టు తెలిపింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.