క్రీడాభూమి

నాసిర్ హుస్సేన్ గిన్నిస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 6: చాలా ఎత్తు నుంచి వచ్చిన బంతిని క్యాచ్ పట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ గిన్నిస్ రికార్డును సృష్టించాడు. పాకిస్తాన్‌తో నాలుగు టెస్టులు, ఐదు వనే్డలు, ఒక టి-20 మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో లార్డ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బంతిని ఆకాశంలోకి ఎగరేసి, దానిని క్యాచ్ పట్టే పోటీని నిర్వహించాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైన నాసిర్ హుస్సేన్ రెండో ప్రయత్నంలో 32 మీటర్ల ఎత్తు నుంచి పడిన బంతిని ఒడుపుగా క్యాచ్ పట్టాడు. అదే ఉత్తమ క్యాచ్. కానీ, మొదటి స్థానంతో సంతృప్తి చెందని అతను ఏకంగా గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించాడు. 49 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూసుకొచ్చిన బంతిని క్యాచ్ పట్టి, కొత్త రికార్డు సృష్టించాడు. గిన్నిస్ బుక్ అధికారులు అక్కడే అతనికి ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించారు.

జర్మనీకి బోల్ట్
కింగ్‌స్టన్, జూలై 6: ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ మెరుగైన వైద్య సేవల కోసం జర్మనీకి బయలుదేరి వెళ్లాడు. జమైకాలో ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొన్నప్పుడు బోల్ట్ ఎడమకాలి కండరాలు బెణకడంతో పోటీల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొని, 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని ‘ట్రిపుల్ ట్రిపుల్’ను సాధించాలనుకున్న అతని ఆశలకు ఈ గాయం గండికొడుతున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్ ఆరంభమయ్యేలోగా పూర్తిగా కోలుకోవాలన్న ఉద్దేశంతో అతను మెరుగైన వైద్యం కోసం జర్మనీకి వెళ్లాడు.