క్రీడాభూమి

ఇద్దరు సూపర్ స్టార్లకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా/ జొహానె్నస్‌బర్గ్, జూలై 6: అంతర్జాతీయ క్రీడా రంగంలో సూపర్ స్టార్లు లియోనెల్ మెస్సీ, ఆస్కార్ పిస్టోరియస్ జైలు శిక్షకు అనుభవించనున్నారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరినీ దోషులుగా కోర్టులు ప్రకటించాయి. పన్ను ఎగవేత కేసులో స్పెయిన్ కోర్టు మెస్సీ నేరం చేసినట్టు రుజువైందని ప్రకటించిన కోర్టు అతనికి 21 నెలల జైలు శిక్షను విధించింది. గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్ హత్యా నేరాన్ని ఎదుర్కొన్న ‘బ్లేడ్ రన్నర్’ పిస్టోరియస్‌కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. ప్రపంచ క్రీడా రంగాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఇద్దరు స్టార్లకు కోర్టులు జైలు శిక్ష విధించడం సంచలనం రేపుతోంది.
‘బ్లేడ్ రన్నర్’కు నిరాశే!
క్రీడాభిమానులకు పరిచయం అవసరం లేని ‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్‌కు నిరాశే మిగిలింది. శిక్షను తప్పించుకోవడానికి అతనికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను హత్య చేసిన పిస్టోరిస్ తాను ఉద్దేశపూర్వకంగా ఆమెను చంపలేదంటూ వాదనలు వినిపించాడు. కింది కోర్టులో అతనికి ఊరట లభించినప్పటికీ, ప్రాసిక్యూషన్ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అప్పటి వరకూ అతనిని వెన్నంటి ఉన్న అదృష్ట దేవత ముఖం చాటేసింది. అతనిని దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు దీనికి సంబంధించిన ఇతరత్రా కేసులను స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీనితో కేసు మళ్లీ కింది కోర్టుకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో 15 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుంది. అయితే, రెండు కాళ్లూ లేని పిస్టోరియస్‌ది ప్రత్యేక కేసు కాబట్టి శిక్షను ఆరు సంవత్సరాలకు పరిమితం చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన ఈ కేసులో పిస్టోరిస్ తనకు విధించిన శిక్షపై మళ్లీ అప్పీల్ చేసే అవకాశం లేదు. ఇప్పటికే అన్ని దారులు మూసుకుపోవడంతో అతను జైలుకు వెళ్లక తప్పదు. మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడంటూ, ప్రత్యేకంగా శిక్షా కాలాన్ని తగ్గిస్తే తప్ప, అతను జైలు నుంచి ఆరేళ్లలోగా విడుదలయ్యే అవకాశం లేదు. ఈ శిక్షతో పిస్టోరియస్ కెరీర్‌కు తెరపడింది.
మెస్సీకి ఊరట!
పిస్టోరియస్‌తో పోలిస్తే మెస్సీకి చిన్న కేసు. జైల్లో గడపాల్సిన అవసరం లేదన్న వార్త అతనికి ఊరటనిస్తోంది. స్పెయిన్‌లో బార్సిలోనా సాకర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను అక్కడ తాను సంపాదించిన ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. మెస్సీ ఆర్థిక వ్యవహారాలన్నీ అతని తండ్రి జార్జి హొరాసియో చూస్తున్నాడు. ఇదే విషయాన్ని మెస్సీ చాలా సందర్భాల్లో చెప్పాడు. తన తండ్రి పన్ను ఎగవేతకు పాల్పడతాడని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. కోర్టులో తాను నిర్దోషినని మెస్సీ వాదించాడు. తాను ఎప్పుడూ పన్నును ఎగ్గొట్టాలని అనుకోలేదని స్పష్టం చేశాడు. కానీ, స్పెయిన్ ఆదాయపన్ను శాఖ ఖచ్చితమైన సమాచారంతో మెస్సీపై పెట్టిన కేసులో ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించింది. వాటిని కోర్టు ముందు ఉంచింది. ఇరు వర్గాల వాదనలు విన్నతర్వాత మెస్సీకి 21 నెలల జైలు శిక్షను విధించింది. అంతేగాక 14 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించింది. మెస్సీ తండ్రి జార్జి హొరాసియోకు 10 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశాన్ని మెస్సీకి కల్పించింది. అతను ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అంతేగాక, స్పెయిన్‌లోని చట్టాలను అనుసరించి రెండేళ్ల కంటే తక్కువ కాలం జైలు శిక్ష పడిన వారు ఆ సమయాన్ని ప్రొబెషన్ రూపంలో పూర్తి చేయవచ్చు. కాబట్టి మెస్సీ జైల్లో ఊచలు లెక్కించాల్సిన అవసరం ఉండదు.