క్రీడాభూమి

జైట్లీకి పరస్పర ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ సంఘం (డిడిసిఎ) అధ్యక్షుడిగా పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. డిడిసిఎలో అవినీతి, కుంభకోణాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ మాజీ టెస్టు క్రికెటర్, బిజెపి పార్లమెంటు సభ్యుడు కీర్తీ ఆజాద్ ధ్వజమెత్తగా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నేతలు కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై విమర్శలు గుప్పించారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌సహా మొత్తం ఆరుగురిపై జైట్లీ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. అయితే, ఈ ఆరుగురిలో ఆజాద్ లేడు. బిజెపి నాయకుడైనందుకే అతనిని జైట్లీ కోర్టుకు లాగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇలావుంటే, హాకీ ఇండియా (హెచ్‌ఐ) సలహామండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్న జైట్లీ అదే సంస్థకు న్యాయవాదిగా బాధ్యతలను తన కుమార్తె సనాలీకి ఇప్పించుకున్నాడని నిషిద్ధ భారత హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) అధ్యక్షుడు, మాజీ పోలీస్ అధికారి కెపిఎస్ గిల్ ఆరోపించాడు. హాకీ ఇండియాలో జైట్లీ, ఆయన కుమార్తె కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నందువల్ల, పరస్పర ప్రయోజనాల అంశం ఇందులో ఇమిడి ఉందని పేర్కొన్నాడు. ఈ విషయంపై విచారణ జరిపించి, జైట్లీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అతను లేఖ రాశాడు. ఐహెచ్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి అశోక్ మాథుర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రికి గిల్ లేఖ రాసిన మాట వాస్తవమేనని అతను పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. హెచ్‌ఐ ప్రభుత్వేతర సంస్థల చట్టం ప్రకారం ఢిల్లీలో రిజిస్టరైందని తెలిపాడు. కాబట్టి హెచ్‌ఐలో అవకతవకలు జరిగితే చర్య తీసుకునే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉందని అన్నాడు.
నో కామెంట్: బత్రా
అరుణ్ జైట్లీపై కెపిఎస్ గిల్ చేసిన ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బత్రా నిరాకరించాడు. హెచ్‌ఐ జైట్లీకి పరస్పర ప్రయోజనాలున్నాయంటూ గిల్ ధ్వజమెత్తిన విషయాన్ని విలేఖరు ప్రశ్నించగా అతను స్పందించలేదు. హెచ్‌ఐకి సొనాలీ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నదన్న విషయాన్ని అతను అంగీకరించాడు. అయితే, అది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుందో రాదో తెలియదని వ్యాఖ్యానించాడు.