క్రీడాభూమి

‘తొలి పరీక్ష’కు కుంబ్లే రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ కిట్స్, జూలై 7: ఇటీవలే టీమిండియా చీఫ్ కోచ్‌గా బాధ్యత తీసుకున్న అనిల్ కుంబ్లే ఈ కొత్త ఇన్నింగ్స్‌లో ‘తొలి పరీక్ష’కు సిద్ధమవుతున్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడేందుకు ఇక్కడికి చేరుకుంది. విమానాశ్రయం నుంచి తమకు కేటాయించిన హోటల్‌కు వెళ్లింది. విండీస్‌తో సిరీస్ ఆరంభానికి ముందు భారత్ రెండు వామప్ మ్యాచ్‌లనుకూడా ఆడుతుంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో మొదటి వామప్ మ్యాచ్‌ని ఈనెల 9, 10 తేదీల్లో ఆడుతుంది. రెండో వామప్ మ్యాచ్ 14 నుంచి 16 వరకు జరుగుతుంది.
మొదటి టెస్టు ఆంటిగువాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుంది. రెండో టెస్టును కింగ్‌స్టన్‌లో జూలై 30 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఆడతారు. మూడో టెస్టును గ్రాస్ ఐస్లెట్‌లో ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తారు. చివరిదైన నాలుగో టెస్టు ఆగ్టు 18 నుంచి 22వ తేదీ వరకు జరుగుతుంది. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో వివిధ పదవులను సమర్థంగా నిర్వహించిన కుంబ్లే ఇటీవలే భారత జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. స్వయంగా బౌలర్ కావడంతో బౌలింగ్ విభాగంపైనే తొలుత దృష్టి కేంద్రీకరిస్తానని అతను విండీస్ టూర్‌కు బయలుదేరడానికి ముందే ప్రకటించాడు. కోచ్‌గా తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కుంబ్లే ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించాడు. ఆటగాళ్లతో మేమేకవుతూ, నెట్స్‌లో తానే స్వయంగా బౌలింగ్ కూడా చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. విండీస్‌తో పోలిస్తే భారత జట్టు పటిష్టంగా ఉంది. దీనికితోడు కుంబ్లే వంటి సమర్థుడు కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. గణాంకాలను, ప్రస్తుత జట్ల బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే, సిరీస్‌ను భారత్ గెల్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయతే, కుంబ్లే మా త్రం ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయబోమని స్పష్టం చేస్తున్నాడు.