క్రీడాభూమి

వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 7: అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అక్కాచెల్లెళ్ల పోరు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఉండడం లేదు. ‘నల్ల కలువలు’ సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ సెమీస్ చేరడంతో, వీరిద్దరూ సులభంగానే ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ చేరతారని అంతా ఊహించారు. అక్కాచెలెళ్ల మధ్య పోరు అలరిస్తుందని ఆశించారు. కానీ, ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా సెమీఫైనల్ అడ్డంకిని సులభంగానే అధిగమించి ఫైనల్ చేరగా, వీనస్ ఓటమిపాలై నిష్క్రమించింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెల్చుకొని, అత్యధిక టైటిళ్ల రికార్డును స్ట్ఫె గ్రాఫ్‌తో కలిసి పంచుకునే ఊపుమీద ఉన్న 34 ఏళ్ల సెరెనా కేవలం 49 నిమిషాల్లోనే ఎలెనా వెస్నినాను 6-2, 6-0 తేడాతో చిత్తుచేసి, తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్ చేరింది. వీనస్ సెమీఫైనల్‌లో విజయం సాధించి ఉంటే, ఆమెతో వింబుల్డన్‌లో ఐదోసారి, మొత్తం మీద గ్రాండ్ శ్లామ్స్‌లో తొమ్మిదోసారి టైటిల్ పోరులో పోటీపడి ఉండేది. కానీ, ఏంజెలిక్ కెర్బర్‌తో తలపడిన 36 ఏళ్ల వీనస్ 4-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. కెరీర్‌లో 32వ గ్రాండ్ శ్లామ్ సెమీ ఫైనల్ ఆడిన సెరెనా 11 ఏస్‌లు, 28 విన్నర్లతో ఆధిపత్యాన్ని కొనసాగించగా, వీనస్ అదే స్థాయిలో ఆడలేకపోయింది. కెర్బర్ ఆధిపత్యానికి గండికొట్టలేక పరాజయాన్ని ఎదుర్కొంది.

చిత్రాలు.. కెరీర్‌లో తొమ్మిదో సారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్
సెరెనా విలియమ్స్
వీనస్ విలియమ్స్‌ను ఓడించి వింబుల్డన్ ఫైనల్‌లో సెరెనాతో పోరును ఖాయం చేసుకున్న
ఏంజెలిక్ కెర్బర్