క్రీడాభూమి

యూరో 2016 సాకర్ గ్రీజ్మన్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెల్లే, జూలై 8: ఆంటోనీ గ్రీజ్మన్ రెండు గోల్స్‌తో రాణించి, పోర్చుగల్‌తో జరిగిన యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో ఫ్రాన్స్‌ను ఫైనల్ చేర్చాడు. అంతేగాక, ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతని ఖాతాలో ఆరు గోల్స్ ఉన్నాయి. ఒక యూరో చాంపియన్‌షిప్‌లో తొమ్మిది గోల్స్‌తో రికార్డు సృష్టించిన మైఖేల్ ప్లాటినీ రికార్డును చేరుకోవడానికి అతను ఇంకా మూడు గోల్స్ చేయాలి. పోర్చుగల్‌తో జరిగే ఫైనల్‌లో అతను తన ప్రయత్నంలో సఫలమవుతాడేమో చూడాలి. కాగా, పలువురు మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచ చాంపియన్‌గా బరిలోకి దిగినప్పటికీ జర్మనీ ఫైనల్ చేరలేకపోయింది. సుమారు 65,000 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జర్మనీపై ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని కనబరచింది. ఫ్రెంచ్ ఆటగాళ్లు ఒక వ్యూహం ప్రకారం ఆడగా, తీవ్రమైన ఒత్తిడికి గురైన జర్మనీ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్ 47వ నిమిషంలో మొదటి గోల్ సాధించిన గ్రీజ్మన్ ద్వితీయార్ధం లో మరో గోల్ చేశా డు. 72వ నిమిషం లో అతను సాధించిన గోల్‌తో జర్మనీపై 1958 తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ మొదటిసారి విజయభేరి మోగించింది. గ్రీజ్మన్ చేసిన తొలి గోల్‌పై వివాదం తలెత్తినప్పటికీ, రిఫరీ తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో జర్మనీ నిరసన వ్యర్థమైంది. ఆరంభం నుంచి గోల్స్ కోసం జర్మనీ చేసిన ప్రయత్నాలకు గండికొట్టిన ఫ్రాన్స్ చివరికి తన చిరకాల ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని సంపాదించి, విజయాన్ని నమోదు చేసింది. ఇలావుంటే, ఫైనల్‌లో పోర్చుగల్‌ను ఫ్రాన్స్ ఎదుర్కొంటుంది. క్రిస్టియానో రొనాల్డో, నాని వంటి మేటి ఆటగాళ్లు ఉన్న పోర్చుగల్ సుమారు 21 సంవత్సరాలుగా ఒక మేజర్ టోర్నీ టైటిల్ కోసం ఎదురు చూస్తున్నది.
రొనాల్డో ప్రతిభ పోర్చుగల్‌ను విజేతగా నిలబెడుతుందా లేక ప్ర పంచ చాంపియన్ జర్మనీపై విజ యం సాధించి మంచి ఊపుమీ ద ఉన్న ఫ్రాన్స్ సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తుందా అన్నది ఆసక్తిని రేపుతున్నది.