క్రీడాభూమి

స్మిత్‌కు ఐసిసి అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోబర్స్ ట్రోఫీ విజేతలు

రాహుల్ ద్రవిడ్ (2004), ఆండ్రీ ఫ్లింటాఫ్, జాక్వెస్ కాలిస్ (2005లో సంయుక్త విజేతలు), రికీ పాంటింగ్ (2006, 2007), శివనారైన్ చందర్‌పాల్ (2008), మిచెల్ జాన్సన్ (2009, 2014), సచిన్ తెండూల్కర్ (2010), జొనథాన్ ట్రాట్ (2011), కుమార సంగక్కర (2012), మైఖేల్ క్లార్క్ (2013), స్టీవెన్ స్మిత్ (2015).

దుబాయ్, డిసెంబర్ 23: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’, ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా ఎన్నికైనందుకు ప్రతిష్ఠాత్మక సర్ గారీ సోబర్స్ అవార్డును సంపాదించుకున్న క్రికెటర్లలో స్మిత్ 11వ ఆటగాడు. ఆసీస్ తరఫున నాలుగోవాడు. ఇంతకు ముందు రికీ పాంటింగ్ (2006, 2007), మిచెల్ జాన్సన్ (2009, 2014) చెరి రెండు సార్లు, మైఖేల్ క్లార్క్ (2013) ఒకసారి ఈ అవార్డును పొందారు.
ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరచిన స్మిత్‌కు టెస్టు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును స్వీకరించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా అతను జాబితాలో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు రాహుల్ ద్రవిడ్ (2004), జాక్వెస్ కాలిస్ (2005), రికీ పాంటింగ్ (2006), కుమార సంగక్కర (2012), మైఖేల్ క్లార్క్ (2013), మిచెల్ జాన్సన్ (2014) ఈ అవార్డును అందుకున్నారు. ఆ మేటి క్రికెటర్ల సరసన స్మిత్ స్థానం దక్కించుకున్నాడు.
2014 సెప్టెంబర్ 18 నుంచి 2015 సెప్టెంబర్ 13వ తేదీ మధ్య కాలంలో నిర్వహించిన ఓటింగ్‌లో స్మిత్‌కు అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఈ కాలంలో అతను 13 టెస్టులు ఆడి, 82.57 సగటుతో 1,734 పరుగులు చేశాడు. ఈ స్కోరులో ఏడు సెంచరీలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. 26 ఏళ్ల స్మిత్ 26 వనే్డలు ఆడడం గమనార్హం. అతను సుమారు 60 సగటుతో 1,249 పరుగులు సాధించాడు. ఈఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోనూ అతను పాల్గొన్నాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న ఆసీస్ జట్టులో అతను సభ్యుడు. భారత మాజీ కెప్టెన్, ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్ అనీల్ కుంబ్లే అధ్యక్షతన ఎంపికైన ఐసిసి టెస్టు, వనే్డ జట్లలో అతనికి స్థానం దక్కడం విశేషం.
సంతోషంగా ఉంది
ప్రపంచంలో ఎంతో మంది మేటి క్రికెటర్లు ఉన్నారని, వారికి కాకుండా తనకు ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని స్మిత్ అన్నాడు. 2015ను ఒకసారి గుర్తుచేసుకుంటే, తనకు మిశ్రమ ఫలితాలు కనిపస్తున్నాయని విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. స్వదేశంలో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకోవడం, ఆసీస్ వనే్డ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయాలని అన్నాడు. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో ట్రోఫీని నిలబెట్టుకోలేకపోవడం బాధను కలిగిస్తున్నదని తెలిపాడు. మొత్తం మీద ఈఏడాది ఎంతో సంతృప్తికరంగా సాగిందని అన్నాడు. స్థూలంగా చెప్పాలంటే తాను సంతోషిస్తున్నానన్నాడు.
వనే్డల్లో మేటి డివిలియర్స్
వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఈ ఏటి మేటి క్రికెటర్ అవార్డు ఎబి డివిలియర్స్‌కు లభించింది. దక్షిణాఫ్రికా జట్టుకు వనే్డల్లో కెప్టెన్‌గా కూడా సేవలు అందిస్తున్న అతను అసాధారణ ప్రతిభతో రాణించాడు. పలు రికార్డులను తనపేరిట నమోదు చేసుకున్నాడు.
విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా పేరుతెచ్చుకున్న ఎబి డివిలియర్స్ అవార్డుకు నిర్ణయించిన కాలంలో 20 వనే్డ ఇన్నింగ్స్ ఆడి 79 సగటుతో 1,265 పరుగులు సాధించాడు. స్ట్రయికింగ్ రేట్ 128.4 పరుగులు ఉందంటే, అతని దూకుడు ఏ విధంగా కొసాగిందో ఊహించుకోవచ్చు. అతని స్కోరులో రెండు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. 2010లోనూ ఈ అవార్డును అందుకున్న డివిలియర్స్ ఇటీవల ఐసిసి ప్రకటించిన వనే్డ జట్టుకు కెప్టెన్ హోదాను దిక్కించుకున్నాడు.
చిరస్మరణీయం..
ఈ సంవత్సరం తనకు చిరస్మరణీయమైనదని డివిలియర్స్ అన్నాడు. ఐసిసి ‘వనే్డ క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందడం ఎంతో ఆనందంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ ఏడాదిని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఎక్కువ భాగం సంతృప్తికరంగా ఉందని, కొన్నిసార్లు నిరుత్సాహ పడ్డానని తెలిపాడు. వాండరర్స్ స్టేడియంలో వెస్టిండీస్‌పై సాధించిన శతకం తనకు ఎనప్పటికీ గుర్తుండి పోతుందని అన్నాడు. జట్టు విజయం సాధించడమే తనకు ముఖ్యమని, జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోనని అన్నాడు. దక్షిణాఫ్రికాకు సాధ్యమైనన్ని ఎక్కువ విజయాలను సాధించి పెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.