క్రీడాభూమి

క్రికెట్ సినిమాలో గవాస్కరే షోలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: క్రికెట్ రంగాన్ని సినిమాతో పోలిస్తే, అందులో కలికితురాయిగా నిలిచిపోయే షోలే ఎవరు? మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను తప్ప ఎవరినీ ఈ స్థాయిలో ఊహించలేమని మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెవాగ్ వ్యాఖ్యానించాడు. గవాస్కర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలిపిన అతను గవాస్కర్‌లో క్రికెట్ సినిమాలో షోలే లాంటి వాడని ప్రశంసించాడు. హెల్మెట్ లేకుండా గవాస్కర్ ఓపెనర్‌గా కెరీర్‌ను కొనసాగించిన విధానాన్ని సెవాగ్ గుర్తుచేశాడు. తలకే కాకుండా శరీరం మొత్తాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ఆచ్ఛాదనాలు ఉన్నప్పటికీ గవాస్కర్ మాదిరిగా ఎవరూ ఫాస్ట్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేరని కొనియాడాడు. హెల్మెట్ పెట్టుకోకుండానే కెరీర్‌ను కొనసాగించడం గవాస్కర్‌కే మాత్రమే సాధ్యమని పేర్కొన్నాడు. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని అధిగమించిన, 30 శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా గవాస్కర్ రికార్డులు సృష్టించాడు. కెరీర్‌లో ఆడిన మొట్టమొదటి టెస్టు సిరీస్‌లోనే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా అతని ఖాతాలోనే ఉంది. వెస్టిండీస్‌పై అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను సృష్టించిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. అదే విధంగా ఒక టెస్టులో ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీని రెండు పర్యాయాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గానూ గవాస్కర్ రికార్డు సృష్టించాడు.