క్రీడాభూమి

ఫైడ్ గ్రాండ్ ప్రీ టైటిల్‌కు అడుగు దూరంలో హారిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెంగ్డూ (చైనా), జూలై 13: గుంటూరుకు చెందిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ద్రోణంవల్లి హారిక ఫైడ్ మహిళల గ్రాండ్ ప్రీ చెస్‌లో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. చైనాలో జరుగుతున్న చెంగ్డూ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్‌లో బుధవారం పదో రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించి కీలకమైన అర పాయింట్‌ను సాధించిన హారిక స్కోరుబోర్డులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆరేసి పాయింట్లతో ప్రస్తుతం సంయుక్తంగా ద్వితీయ స్థానంలో ఉన్న కోనేరు హంపి (్భరత్), అంటోయెనెటా (బల్గేరియా) కంటే ఉన్నత స్థానంలో నిలిచిన హారిక (6.5 పాయింట్లు) ఈ టోర్నీలో టైటిల్ గెలవాలంటే గురువారం రష్యా క్రీడాకారిణి ఓల్గా గిర్యాతో జరిగే చివరి గేమ్‌ను డ్రాగా ముగిస్తే సరిపోతుంది. మరో ఫైనల్ గేమ్‌లో హంపి-అంటోయెనెటా తలపడనుండటంతో హారిక పని సులువు కానుంది.