క్రీడాభూమి

హాకీ లెజెండ్ షాహిద్‌కు గోయల్ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: కాలేయ, మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ గుర్గావ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాకీ లెజెండ్ మొహమ్మద్ షాహిద్‌ను క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పరామర్శించారు. బుధవారం ఆయన గుర్గావ్‌లోని ఆసుపత్రికి వెళ్లి షాహిద్‌ను పరామర్శించారని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కామెర్లతో పాటు డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న షాహిద్ పరిస్థితి క్షీణించడంతో ఈ నెల ఆరంభంలో ఆయనను వారణాసి నుంచి విమానంలో గుర్గావ్‌కు తరలించి మేదాంత-మెడిసిటీ ఆసుపత్రిలో చేర్చారు. షాహిద్‌కు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని క్రీడాశాఖ మాజీ మంత్రి జితేంద్ర సింగ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం విదితమే. అలాగే తమ శాఖలో ఉద్యోగిగా ఉన్న షాహిద్ వైద్యానికి అయ్యే ఖర్చులను భరిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. నైపుణ్యతలకు పెట్టింది పేరైన షాహిద్ మన దేశంలోని మేటి హాకీ ఆటగాళ్లలో ఒకడిగా ఖ్యాతి పొందాడు. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్‌లో మన దేశానికి పసిడి పతకాన్ని అందించిన వి.్భస్కరన్ నేతృత్వంలోని జట్టులో సభ్యుడిగా ఉన్న షాహిద్, 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని, అలాగే 1986లో జరిగిన సియోల్ ఏషియాడ్‌లో కాంస్య పతకాన్ని సాధించిన జాతీయ జట్టులో కూడా సభ్యుడే.
మోదీకి ధన్‌రాజ్ పిళ్లై ధన్యవాదాలు
ఇదిలావుంటే, షాహిద్‌కు ఆర్థిక సహాయాన్ని అందజేసినందు గాను భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు క్రీడా, రైల్వే శాఖలకు ధన్యవాదాలు తెలిపాడు. షాహిద్ వైద్య చికిత్స కోసం సకాలంలో ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్న ప్రధాన మంత్రితో పాటు క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ధన్‌రాజ్ పిళ్లై పేర్కొన్నాడు. అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అర్జున అవార్డు గ్రహీత షాహిద్‌కు చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ధన్‌రాజ్ పిళ్లై ఇటీవల ప్రధాన మంత్రితో పాటు ఇతర మంత్రులకు, క్రీడా సంఘాలకు విజ్ఞప్తి చేశాడు. ఈ విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన రైల్వే శాఖ తమ ఉద్యోగి షాహిద్ చికిత్సకు అయ్యే ఖర్చులన్నింటినీ భరించేందుకు ముందుకురాగా, క్రీడా శాఖ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అలాగే ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన షాహిద్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.