క్రీడాభూమి

వెస్టిండీస్ జట్టులోకి కమ్మిన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్, జూలై 13: టీమిండియాతో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడే తమ జట్టులో జెరోమ్ టేలర్ స్థానాన్ని అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ మిగల్ కమ్మిన్స్‌తో భర్తీ చేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) బుధవారం వెల్లడించింది. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు టేలర్ ప్రకటించడంతో అతనికి బదులుగా కమ్మిన్స్‌ను జట్టులో చేర్చుకున్నామని డబ్ల్యుఐసిబి తెలిపింది. 25 ఏళ్ల కమ్మిన్స్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకూ 41 మ్యాచ్‌లు ఆడి 22.56 సగటుతో 116 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ టెస్టు జట్టులో కమ్మిన్స్ కూడా ఉన్నప్పటికీ ఆ సిరీస్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు టేలర్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టేలర్ 13 ఏళ్ల కెరీర్‌లో 46 టెస్టు మ్యాచ్‌లు ఆడి 130 వికెట్లు సాధించాడు.
తొలి టెస్టుకు విండీస్ జట్టు ఇదే
జాసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (వైస్-కెప్టెన్), డేవేంద్ర బిషూ, జెర్మయిన్ బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, రాజేంద్ర చంద్రిక, రోస్టన్ చేస్, మిగల్ కమ్మిన్స్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియెల్, లియాన్ జాన్సన్, మర్లాన్ శామ్యూల్స్.