క్రీడాభూమి

ఎంపీలు, బాలీవుడ్ నటుల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: పార్లమెంట్ సభ్యులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు మధ్య ఈ నెల 24వ తేదీన న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలన్న ప్రయత్నాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లో మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ తదితర ఎంపీలతో కూడిన పార్లమెంటేరియన్ల జట్టుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సారథ్యం వహించనుండగా, రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, డినో మారియా తదితర నటులతో కూడిన బాలీవుడ్ జట్టుకు అభిషేక్ బచ్చన్ సారథిగా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది అండర్-17 ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న మన దేశంలో ఫుట్‌బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ మ్యాచ్ తోడ్పడుతుంది.
‘వాకా వాకా’ను తలదనే్నలా
అండర్-17 వరల్డ్ కప్ థీమ్ సాంగ్
ఇదిలావుంటే, బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రతిమ్ చక్రవర్తితో కలసి అండర్-17 ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు థీమ్ సాంగ్‌ను (సందేశ గీతాన్ని) రూపొందించాల్సిందిగా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తనకు బాధ్యతను అప్పగించాడని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎంపీ బాబుల్ సుప్రియో వెల్లడించాడు. ఆరేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ప్రముఖ పాప్‌స్టార్ షకీరా రూపొందించిన ‘వాకా వాకా’ గీతాన్ని తలదనే్నలా అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ థీమ్ సాంగ్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తానని బాబుల్ సుప్రియో తెలిపాడు.